ఏపీ ప్రభుత్వంతో బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ఎంఓయూ | - | Sakshi
Sakshi News home page

ఏపీ ప్రభుత్వంతో బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ఎంఓయూ

Nov 17 2026 1:50 AM | Updated on Nov 17 2026 1:50 AM

ఏపీ ప్రభుత్వంతో బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ఎంఓయూ

భవానీపురం(విజయవాడపశ్చిమ): ప్రభుత్వ ఉద్యోగుల వేతన ఖాతాల ప్రారంభానికి సంబంధించి బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర విజయవాడ జోన్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఫైనాన్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పీయూష్‌ కుమార్‌తో సోమవారం ఎంఓయూ కుదుర్చుకున్నట్లు బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర విజయవాడ జోనల్‌ మేనేజర్‌ ఎం.సత్యనారాయణ తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వ్యక్తిగత ప్రమాద బీమా, టర్మ్‌ లైఫ్‌ ఇన్‌స్యూరెన్స్‌, ప్రీమియం డెబిట్‌ కార్డ్‌, ప్రత్యేక బ్యాంకింగ్‌ ప్రయోజనాలు అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, వాహన రుణాలపై ప్రత్యేక రాయితీలు, ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ బ్యాంకింగ్‌ సదుపాయాలను కల్పించనున్నట్లు వివరించారు. ప్రభుత్వ ఉద్యోగులకు మెరుగైన బ్యాంకింగ్‌ సేవలు, బీమా రక్షణ, ఆర్థిక ప్రయోజనాలు అందించడమే ప్రధాన లక్ష్యమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement