నిమ్మకూరు ఏపీఆర్‌జేసీకి ఎక్స్‌లెన్స్‌ అవార్డు | - | Sakshi
Sakshi News home page

నిమ్మకూరు ఏపీఆర్‌జేసీకి ఎక్స్‌లెన్స్‌ అవార్డు

Nov 17 2026 1:50 AM | Updated on Nov 17 2026 1:50 AM

నిమ్మకూరు ఏపీఆర్‌జేసీకి ఎక్స్‌లెన్స్‌ అవార్డు ఆలయంలో హుండీ చోరీ.. ఇద్దరికి జైలు గల్లంతైన చిన్నారి మృతదేహం లభ్యం గంజాయి అక్రమ రవాణా.. ఇద్దరికి రిమాండ్‌ గుంటుపల్లిలో భారీ చోరీ

నిమ్మకూరు(పామర్రు): కృష్ణాజిల్లాలో ఉత్తమ పని తీరు కనబర్చిన విద్యా సంస్థగా ఏపీఆర్‌జేసీ నిమ్మకూరు గుర్తింపు పొందటం ఎంతో అభినందనీయమని రిటైర్టు వింగ్‌ కమాండర్‌, ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ కృష్ణారావు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఐదు బెస్టు పెర్ఫార్మింగ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌లో కృష్ణాజిల్లాకు గాను నిమ్మకూరు ఏపీఆర్‌జేసీని గుర్తించిన ఫారెస్ట్‌ బై హార్ట్స్‌ లెన్స్‌ ఫౌండేషన్‌ ఈ అవార్డును కళాశాల ప్రిన్సిపాల్‌ పి. సాంబశివరావుకు సోమవారం ప్రదానం చేసిందన్నారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, ప్రకృతి పట్ల విద్యార్థులలో అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను నిర్వహించడ ద్వారా ఇది సాధ్యమైందన్నారు. ఫౌండేషన్‌ కృష్ణాజిల్లా క్లస్టర్‌ కోఆర్డినేటర్లు ఫజిల్‌, యమునా, అరుణ్‌ తదితరులు పాల్గొన్నారు.

గుడివాడరూరల్‌: ఆంజనేయస్వామి ఆలయంలోని హుండీ చోరీ కేసులో ఇద్దరి నిందితులకు 6నెలలు జైలుశిక్ష, రూ.1000 జరిమానా విధించారని టూటౌన్‌ పోలీసులు సోమవారం తెలిపారు. వారు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని పెద ఎరుకపాడులో వేంచేసియున్న శ్రీఆంజనేయస్వామి దేవాలయం హుండీ పగలకొట్టి నగదు చోరీ చేసిన కేసులో విజయవాడకు చెందిన ఇద్దరు దొంగలు రంగ రాము, ప్రత్తిపాటి శ్రీనివాస్‌లను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా చేసిన నేరాన్ని అంగీకరించారన్నారు. సాక్ష్యాధారాలతో నిందితులను కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి పి.గాయత్రి నిందితులకు ఆరునెలలు జైలుశిక్ష, రూ.1000 జరిమానా విధించారని పోలీసులు తెలిపారు.

పామర్రు: స్థానిక గాంధీ నగరానికి చెందిన ఇద్దరు చిన్నారులు పుల్లేరు కాలువలో గల్లంతవ్వగా వీరిలో ఒకరి మృతదేహం ఆదివారం లభ్యమైంది. మరొక మృతదేహం కోసం సోమవారం ఉదయం నుంచి ఎండీఆర్‌ఎఫ్‌ బృందం రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టింది. గల్లంతైన ప్రాంతానికి సమీపంలోనే అల్లాడ అమరేందర్‌(13) మృత దేహాన్ని గుర్తించి వెలికి తీశారు. ఈ దుర్ఘటనతో గాంధీ నగరం అంతా విషాదంలో మునిగిపోయింది. పామర్రు ఎస్‌ఐ కూచిపూడి శ్రీనివాస్‌ శవ పంచనామ చేసి పోస్టు మార్టం నిమిత్తం గుడివాడ ప్రభుత్వ వైద్య శాలకు తరలించారు. పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

కంచికచర్ల: గంజాయి అక్రమ రవాణా, వినియోగానికి పాల్పడిన ఇద్దరు యువకులను అరెస్ట్‌ చేసి రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు పంపించినట్లు నందిగామ రూరల్‌ సీఐ వైవీఎల్‌ నాయుడు పేర్కొన్నారు. కంచికచర్ల పోలీస్‌స్టేషన్‌లో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ కంచికచర్లకు చెందిన మేచర్ల రాహుల్‌ కార్తికేయ, మేచర్ల శ్రీనివాస్‌ వీరిద్దరూ గంజాయి రవాణా చేయటంతో పాటు వినియోగిస్తున్నారని కంచికచర్ల పోలీసులకు సమాచారం అందటంతో ఇద్దరి వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అరెస్ట్‌ చేశామన్నారు. మేచర్ల శ్రీనివాస్‌ను(3 ఎన్‌డీపీఎస్‌ కేసులున్నాయి) ఈనెల 10వ తేదీన, మేచర్ల కార్తికేయను(6 ఎన్‌డీపీఎస్‌ కేసులున్నాయి) ఈ నెల 15వ తేదీన అరెస్ట్‌ చేసి ఇద్దరిని నందిగామ కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి వారిద్దరికీ రిమాండ్‌ విధించడంతో రాజమండ్రి జైలుకు పంపించామని తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐలు పి. శంకరరావు, నాని నరేందర్‌, పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.

ఇంట్లో 90కాసుల బంగారం అపహరణ

గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): గుంటుపల్లి గ్రామంలో జరిగిన భారీ చోరీ కలకలం రేపింది. ఽగ్రామానికి చెందిన దోనేపూడి కల్యాణి ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి సుమారు 90కాసుల బంగారు ఆభరణాలను అపహరించారు. ఇంటి యజమానురాలు దోనేపూడి కల్యాణి తెల్లవారు జామున వాకింగ్‌కు వెళ్లిన సమయంలో ఇంటి డోరు వేయలేదు. డోర్‌ తెరిచి ఉండటం గమనించిన దొంగలు ఇంట్లోకి చొరబడి బంగారం నగలు చోరీ చేశారు. సమాచారం అందుకున్న డీసీపీ గుణ్ణం రామకృష్ణ సీఐ సుబ్రహ్మణ్యంతో కలిసి చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. చోరీ జరిగిన తీరు, ఇంట్లోని పరిస్థితులను పరిశీలించి వివరాలు సేకరించారు. క్లూస్‌ టీమ్‌ బృందం చోరీ జరిగిన ప్రాంతంలో ఆధారాలు సేకరించారు. పోలీస్‌ డాగ్‌ నిందితులను గుర్తించేందుకు ఇంటి నుంచి కొంతదూరం వెల్లి ఆగిపోయింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement