రైతులకు కేడీసీసీబీ విరాళం | - | Sakshi
Sakshi News home page

రైతులకు కేడీసీసీబీ విరాళం

Nov 11 2026 3:45 AM | Updated on Nov 11 2026 3:45 AM

రైతులకు కేడీసీసీబీ విరాళం

చిలకలపూడి(మచిలీపట్నం): రైతులకు అండగా కేడీసీసీ బ్యాంకు మంగళవారం కోటి రూపాయల చెక్కును సీఎం చంద్రబాబునాయుడుకు విరాళంగా అందజేసింది. అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబును మంత్రి కొల్లు రవీంద్ర, ఆప్కాబ్‌ చైర్మన్‌ గన్ని వీరాంజనేయులుతో కలిసి చైర్మన్‌ రఘురాం ఈ చెక్కును అందజేశారు. అనంతరం చైర్మన్‌ రఘురాం మాట్లాడుతూ రైతు సంక్షేమమే కేడీసీసీబీ ప్రధాన ధ్యేయమని, ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు అండగా నిలవడం సహకార బ్యాంకు సామాజిక బాధ్యతగా తీసుకున్నామన్నారు. రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వంతో పాటు సహకార రంగం బాధ్యతగా ముందుకు రావాలనే నిర్ణయంతో చెక్కును అందజేశామన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కేడీసీసీ బ్యాంకు చైర్మన్‌ నెట్టెం రఘురాం, బ్యాంకు అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement