హత్యాయత్నం కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు | - | Sakshi
Sakshi News home page

హత్యాయత్నం కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు

Nov 10 2026 1:43 AM | Updated on Nov 10 2026 1:43 AM

లబ్బీపేట(విజయవాడతూర్పు): మహిళా న్యాయవాదిపై హత్యాయత్నం కేసులో నిందితుడికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5 వేలు జరిమానా విఽధిస్తూ సోమవారం అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ సెషన్స్‌ జడ్జి జి.సుబ్రహ్మణ్యం తీర్పు చెప్పారు. వివరాల ప్రకారం 2017 అక్టోబరు 10న కొత్తపేట బంకా కామరాజు వారి వీధిలో నివసించే మహిళా న్యాయవాది ఇంటికి వెళ్లిన నిందితుడు బంకా శివ ఆమైపె దాడి చేశాడు. కేసు నమోదు చేసిన కొత్తపేట పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. కేసు విచారణలో పలువురు సాక్ష్యులను కోర్టులో ప్రవేశ పెట్టగా, నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి నిందితుడికి జైలుశిక్ష, జరిమానా విధించారు.

రైలు ఢీకొని

గుర్తు తెలియని వ్యక్తి మృతి

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటనపై విజయవాడ రైల్వే పోలీసులు (జీఆర్‌పీ) కేసు నమోదు చేశారు. సోమవారం తెల్లవారుజామున విజయవాడ రైల్వేస్టేషన్‌ సమీపంలోని సౌత్‌యార్డ్‌లో గుర్తు తెలియని వ్యక్తి గాయాలతో ట్రాక్‌ పక్కన మృతిచెంది ఉండ టాన్ని గుర్తించిన సిబ్బంది జీఆర్‌పీ పోలీసులకు సమాచారం అందించారు. వారు కేసు నమోదు చేశారు. మృతుని వయస్సు సుమారు 25 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉంటుందని, లైట్‌ గ్రీన్‌ కలర్‌ ఫుల్‌ హ్యాండ్స్‌ షర్ట్‌, బ్లాక్‌ కలర్‌ జీన్స్‌ ప్యాంటు ధరించి ఉన్నాడు. ఎడమ ఛాతిపై, ఎడమ మోచేతి కింద భాగంలో, కుడి అరచెయ్యి వెనుక భాగంలో ‘కరిమున్‌’ పచ్చబొట్లు ఉన్నాయని, ఎటువంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. మృతుని ఆచూకి తెలిసిన వారు విజయవాడ జీఆర్‌పీ పోలీస్‌ స్టేషన్‌లో గాని, లేదా 8897156153, 9247585710 నంబర్ల ద్వారా సమాచారం అందించాల్సిందిగా కోరారు.

బాధితురాలికి

బంగారు వస్తువులు అప్పగింత

కంకిపాడు: ఆటోలో మాయమైన బంగారు వస్తువులను ఎట్టకేలకు బాధితురాలికి అప్పగించారు. కంకిపాడు ఎస్‌ఐ కేవై దాసు తెలిపిన వివరాల ప్రకారం విశాఖపట్నంకు చెందిన అద్దంకి భాగ్యలక్ష్మి ఈనెల 6వ తేదీ 12 గంటల సమయంలో విజయవాడ రైల్వేస్టేషన్‌లో దిగి అక్కడి నుంచి దుర్గమ్మ దర్శనానికి వెళ్లారు. అక్కడి నుంచి ఈడుపుగల్లులోని అత్తగారింటికి వెళ్లి తిరిగి సొంత ఊరుకి బయలుదేరేందుకు గోసాల సెంటరులో ఆటో ఎక్కారు. తన వెంట ఉన్న బ్యాగులో ఒక తులం బంగారు గాజులు, ఒక తులం బంగారు మాల, రెండు మురుగులు భద్రపరుచుకున్నారు. విజయవాడ రైల్వేస్టేషన్‌ వద్ద ఆటో దిగే సమయంలో బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగును ఆటోలో మర్చిపోయారు. ఆభరణాలు కనిపించకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేకంగా విచారణ చేశారు. ఆటోలోనే బంగారు ఆభరణాలను మర్చిపోయినట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బాధితురాలు భాగ్యలక్ష్మికి అప్పగించారు.

సామాజిక మాధ్యమాల ద్వారా మహిళలకు వేధింపులు

ఏపీకి చెందిన నిందితుడి అరెస్ట్‌

చింతకాని: సామాజిక మాధ్యమాల ద్వారా మహిళలు, బాలికలను వేధిస్తున్న ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల మండలం కొత్తపేట గ్రామానికి చెందిన మందా యశ్వంత్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడిని ఆదివారం అరెస్ట్‌ చేయగా తెలంగాణలోని ఖమ్మం జిల్లా వైరా సీఐ వెంకటప్రసాద్‌ వివరాలు వెల్లడించారు. వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ ద్వారా మహిళలు, బాలికలను యశ్వంత్‌ వేధిస్తుండగా చింతకాని పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైందని తెలిపారు. మహిళలు, బాలికల ఫొటోలను పోస్ట్‌ చేస్తూ అసభ్యకర వ్యాఖ్యలు జోడిస్తుండగా అరెస్ట్‌ చేశామని పేర్కొన్నారు. సమావేశంలో చింతకాని ఎస్సై నరేష్‌, సిబ్బంది, పాల్గొన్నారు.

ఆన్‌లైన్‌ డేటింగ్‌ పేరుతో మోసం

రూ. 15 లక్షలకు సైబర్‌ నేరగాళ్లు టోకరా

లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆన్‌లైన్‌ డేటింగ్‌పై ఆసక్తి చూపిన ఓ యువకుడి నుంచి రూ. 15 లక్షలకు సైబర్‌ నేరగాళ్లు టోకరా వేశారు. వివరాల ప్రకారం సిద్ధార్థ నగర్‌లో నివసించే యువకుడి ఫోన్‌ వాట్సాప్‌కు కొంతకాలం కిందట ఆన్‌లైన్‌డేటింగ్‌ పేరుతో ఒక లింక్‌ వచ్చింది. దాన్ని క్లిక్‌ చేయగా పలువురితో చాట్‌ చేసేందుకు, కలిసేందుకు ఈ ఫ్లాట్‌ఫామ్‌లో కొంత మొత్తం చెల్లించి నమోదు కావాలని ఉంది. దీంతో తొలుత రూ.1,999 చెల్లించి నమోదైన తర్వాత, సైబర్‌ నేరగాళ్లు ఇచ్చిన వివరాలు అన్నీ ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ముగ్గులోకి దింపిన నేరగాళ్లు అతని మూడు బ్యాంకు ఖాతాల నుంచి రూ. 15 లక్షలు దోచేశారు. దీంతో మోసపోయానని గ్రహించిన యువకుడు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement