నేటి రాత్రి 7 గంటల వరకే దుర్గమ్మ దర్శనం | - | Sakshi
Sakshi News home page

నేటి రాత్రి 7 గంటల వరకే దుర్గమ్మ దర్శనం

Nov 8 2026 10:36 AM | Updated on Nov 8 2026 10:36 AM

నేటి రాత్రి 7 గంటల వరకే దుర్గమ్మ దర్శనం ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): దీపావళి పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై ఆదివారం రాత్రి 7 గంటల వరకే అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారని ఆలయ అధికారులు పేర్కొన్నారు. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ అనంతరం దీపావళి సందర్భంగా అమ్మవారి ప్రధాన ఆలయంలో మూలవిరాట్టు వద్ద లక్ష్మీపూజ జరుగుతుందన్నారు. అమ్మవారి ఆలయం చుట్టూ దీపాలను వెలిగించిన తర్వాత దేవస్థానం ప్రాంగణంలో దీపావళి వేడుకలు జరుగుతాయని, ఆ తర్వాత ఆలయ ద్వారాలను మూసివేస్తారని పేర్కొన్నారు. తిరిగి సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు అమ్మవారి సుప్రభాత సేవ, వస్త్రాలంకరణ సేవ, ఖడ్గమాలార్చనల అనంతరం అమ్మవారి దర్శనం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. విజయవాడలో మానవ హక్కుల కమిషన్‌ క్యాంపు కోర్టు దుర్గమ్మ సన్నిధిలో మహాలక్ష్మి యాగం ఎన్టీఆర్‌ జిల్లాకు 962 క్వింటాళ్ల ఉల్లిపాయలు ఆటోనగర్‌(విజయవాడతూర్పు): ఎన్టీఆర్‌ జిల్లాకు శనివారం 962 క్వింటాళ్ల సబ్సిడీ ఉల్లిపాయలు వచ్చినట్టు పటమట రైతుబజారు ఎస్టేట్‌ అధికారి రమేష్‌బాబు తెలిపారు. ఇందులో భాగంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని మూడు రైతుబజార్‌ మార్కెట్లకు 19 టన్నల ఉల్లిపాయలు వచ్చినట్టు పేర్కొన్నారు. కేజీ రూ.35 చొప్పున విక్రయిస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా కృష్ణలంక, పటమట, ఏపీఐఐసీ రైతుబజార్లకు వీటిని విక్రయించారని, వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ‘స్వచ్ఛ’ అవార్డుల్లో విజయవాడకు మరోసారి జాతీయ పురస్కారం

విజయవాడలీగల్‌: నగరంలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ క్యాంపు కోర్టు ఏర్పాటు చేసినట్లు బెజవాడ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు విష్ణుభొట్ల లక్ష్మీనారాయణ తెలియజేశారు. నగరంలో క్యాంపు కోర్టు/క్యాంప్‌ సిట్టింగ్‌లు ఏర్పాటు చేయాలని కోరుతూ బెజవాడ బార్‌ అసోసియేషన్‌ రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌కు రిప్రజెంటేషన్‌ అందజేసింది. దీనికి స్పందించిన మానవహక్కుల కమిషన్‌ ఇకపై ప్రతి నెలా రెండవ వారం విజయవాడ కేంద్రంగా విజయవాడ, కృష్ణా, ఏలూరు, భీమవరం జిల్లాల వారికి క్యాంప్‌ కోర్టులు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. నవంబరులో 10వ తేదీ నుంచి 13వ తేదీవరకు 4 రోజులపాటు నిర్వహించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. మానవహక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో విజయవాడ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయలో పెండింగ్‌ కేసుల విచారణతో పాటు కొత్త ఫిర్యాదులు కూడా స్వీకరిస్తారని తెలియజేశారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఽదన త్రయోదశిని పురస్కరించుకుని ఇంద్ర కీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో శనివారం మహాలక్ష్మి యాగాన్ని నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని పాత యాగశాలలో వైదిక కమిటీ పర్యవేక్షణలో అర్చకులు యాగాన్ని చేశారు. లోక క్షేమాన్ని, సర్వజనుల ఆయురారోగ్య, ఐశ్వర్యాలను కాంక్షిస్తూ యాగాన్ని నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన యాగం సుమారు రెండు గంటల పాటు సాగింది. యాగం అనంతరం మహా పూర్ణాహుతిలో ఆలయ ఈవో శీనానాయక్‌, కమిటీ చైర్మన్‌ రాధాకృష్ణ, ట్రస్ట్‌ బోర్డు సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు, రాఘవ రాజు, కళావతి, ప్రత్యేక ఆహ్వానితులు రామబ్రహ్మం పాల్గొన్నారు.

పటమట(విజయవాడతూర్పు): స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు 2025– 26లో విజయవాడ నగరపాలక సంస్థ మరోసారి జాతీయ స్థాయి పురస్కారాన్ని సాధించింది. గతంలో 2024– 25 సంవత్సరానికి ‘సూపర్‌ స్వచ్ఛ లీగ్‌ సిటీ’గా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన విజయవాడ, తాజాగా స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2025–26లో మరోసారి అవార్డును సొంతం చేసుకుంది. ఈ నెల 11వ తేదీ న్యూఢిల్లీలో నిర్వహించనున్న స్వచ్ఛ సర్వేక్షణ్‌ జాతీయ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థకు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement