ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన భక్తులు శనివారం రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. విజయవాడ అయోధ్యనగర్‌కు చెందిన శనగపల్లి ధాన్య రత్నమాధురి కుటుంబంతో అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానం నిమిత్తం రూ. 1,01,116 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ ఏఈవో ఎన్.రమేష్‌బాబు అమ్మవారి చిత్రపటంప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.


