సౌత్‌జోన్‌ చెస్‌ టోర్నీకి జట్టు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

సౌత్‌జోన్‌ చెస్‌ టోర్నీకి జట్టు ఎంపిక

Nov 8 2026 10:36 AM | Updated on Nov 8 2026 10:36 AM

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు హైదరాబాద్‌లో జరగనున్న సౌత్‌ జోన్‌ ఇంటర్‌ యూనివర్సిటీ చెస్‌ (మహిళల) టోర్నమెంట్‌లో పాల్గొనడానికి తమ యూనివర్సిటీ నుంచి ప్రాతినిధ్యం వహించే జట్టును శనివారం ఎంపిక చేశామని డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం స్పోర్ట్స్‌ బోర్డ్‌ సెక్రటరీ ఇ.త్రిమూర్తి తెలిపారు. నగరంలోని యూనివర్సిటీ ఆవరణలో జట్టులోని సభ్యులను వైస్‌చాన్సలర్‌ చంద్రశేఖర్‌ శనివారం అభినందించారు. విజయవాడ సిద్ధార్థ మెడికల్‌ కళాశాలకు చెందిన ఎం.సాయి దివ్య, కాకినాడలోని రంగరాయ మెడికల్‌ కళాశాలకు చెందిన డి.అమూల్య, డి.అనయ్య,ఒంగోలులోని గవర్నమెంట్‌ మెడికల్‌ కళాశాలకు చెందిన నివేదితా భాయ్‌, చినకొండ్రపాడులోని కాటూరి మెడికల్‌ కళాశాలకు చెందిన ఎన్‌.సాత్విక, చిన్న అవుటుపల్లిలోని డాక్టర్‌ పిన్నమనేని సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ కళాశాలకు చెందిన ఎ.శ్రీనిధిలను క్రీడాకారులుగా, ఏలూరులోని సెయింట్‌ జోసెఫ్‌ డెంటల్‌ కళాశాలకు చెందిన ఫిజికల్‌ డైరెక్టర్‌ ఎన్‌.నల్లయ్యను జట్టు మేనేజర్‌గా ఎంపిక చేశామని వివరించారు. జట్టు సభ్యులను వైస్‌చాన్సలర్‌ పి.చంద్రశేఖర్‌, రిజిస్ట్రార్‌ టి.సాయి సుధీర్‌ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement