నులిపురుగుల నివారణకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

నులిపురుగుల నివారణకు చర్యలు

Sep 25 2026 2:29 AM | Updated on Sep 25 2026 2:29 AM

నులిపురుగుల నివారణకు చర్యలు పెనమలూరు: నులిపురుగుల నివారణకు చర్యలు చేపట్టామని రాష్ట్ర చైల్డ్‌ హెల్త్‌ అండ్‌ ఇమ్యూనైజేషన్‌ జాయింట్‌ డైరెక్టర్‌ మార్లగడ్డ సుబ్రహ్మణ్యం తెలిపారు. పెనమలూరు బాలికల హాస్టల్‌లో గురువారం విద్యార్థినులకు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. నులి పురుగుల నివారణతో పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారని తెలిపారు. నులిపురుగుల నివారణకు శుక్రవారం మధ్యాహ్నం భోజనం తరువాత ఆల్బెండజోల్‌ మాత్రలను చిన్నారులు, విద్యార్థులకు వైద్య సిబ్బంది పంపిణీచేయాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కాలేజీల్లో విద్యార్థులకు ఈ మాత్రలు అందించాలని సూచించారు. రాష్ట్రీయ బాల సంరక్షణ ప్రోగ్రామ్‌ అధికారి డాక్టర్‌ హిమబిందు, మండల వైద్యాధికారి బిజిలీ శ్రీనివాస్‌, డాక్టర్‌ సుస్మిత తదితరులు పాల్గొన్నారు. జోరువానలోప్రభుత్వ వైద్యుల నిరసన లబ్బీపేట(విజయవాడతూర్పు): తమకు రావాల్సిన పీఆర్‌సీ బకాయిలను వెంటనే చెల్లించా లని డిమాండ్‌ చేస్తూ ప్రభుత్వం వైద్యులు 24 రోజులుగా చేస్తున్న నిరసన గురువారం జోరు వానలోనూ కొనసాగింది. కొత్త ప్రభుత్వాస్పత్రి ఎదుట ఉదయం గంటపాటు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ప్రభుత్వ వైద్యుల సంఘం – ఆంధ్రప్రదేశ్‌ (జీడీఏ –ఏపీ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఐ.బాబ్జి శ్యామ్‌కుమార్‌ మాట్లాడుతూ.. 2016 యూజీసీ పీఆర్‌సీ బకాయిల విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో వైద్యుడికి రూ.7 లక్షల నుంచి రూ.35 లక్షల వరకూ రావాలన్నారు. ప్రభుత్వం అన్ని కేటగిరీల ఉద్యోగులకు పీఆర్‌సీ బకాయిలు చెల్లించి, వైద్య విద్యా బోధకులను మాత్రమే విస్మరించడం తమ మనోభావాలను దెబ్బ తీసిందన్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

సికింద్రాబాద్‌ – కాకినాడ టౌన్‌ మధ్య ప్రత్యేక రైళ్లు

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): దసరా, దీపావళి, ఛత్‌ పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్‌ – కాకినాడ టౌన్‌ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు విజయవాడ డివిజన్‌ రైల్వే పీఆర్‌ఓ నుస్రత్‌ మండ్రుప్కర్‌ గురువారం ఓ ప్రటకలో తెలిపారు. సికింద్రాబాద్‌ – కాకినాడ టౌన్‌ (07039) అక్టోబర్‌ ఏడు నుంచి నవంబర్‌ 25వ తేదీ వరకు ప్రతి బుధవారం రాత్రి 7.10 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటలకు కాకినాడ టౌన్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07040) అక్టోబర్‌ ఎనిమిది నుంచి నవంబర్‌ 26వ తేదీ వరకు ప్రతి గురువారం రాత్రి తొమ్మిది గంటలకు కాకినాడ టౌన్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8.50 గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది. రెండు మర్గాల్లో ఈ రైళ్లు చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, విష్ణుపురం, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతాయి.

రూ.25 లక్షలు పలికిన గణపతి లడ్డూ ప్రసాదం

కోనేరుసెంటర్‌(మచిలీపట్నం): మంగినపూడి బీచ్‌ సాగరతీరంలో ఏర్పాటుచేసిన 63 అడుగుల మహాగణపతి విగ్రహం వద్ద లడ్డూ ప్రసాదం వేలంలో రూ.25 లక్షలు పలికింది. తుపాను నేపథ్యంలో కమిటీ నిర్వాహకులు 630 కిలోల లడ్డూ ప్రసాదానికి గురువారం ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో వేలం నిర్వహించారు. ఆఫ్‌లైన్‌లో మచిలీపట్నం నగరానికి చెందిన పలువురు ప్రముఖులు, ఇతర ప్రాంతాలకు చెందిన అనేక మంది భక్తులు ఆన్‌లైన్‌లో పాల్గొని పోటీపడ్డారు. మచిలీపట్నానికి చెందిన ఎఫ్‌సీఎస్‌ ట్రేడింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అధినేత గుమ్మడి భవానీశంకర్‌ రూ.25 లక్షలకు ఆన్‌లైన్‌ వేలంలో స్వామివారి లడ్డూను దక్కించుకున్నారు. భవానీశంకర్‌ దంపతులకు శుక్రవారం స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని మంత్రోచ్చరణ నడుమ వేదపండితుల సమక్షంలో అందజేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement