న్యూస్‌రీల్
చింతలపాడులో ఇళ్లు ధ్వంసం
మరో రెండు రోజుల పాటు కొనసాగుతాయన్న వాతావరణశాఖ తిరువూరు మండలం చింతలపాడులో ఈదురుగాలుల విధ్వంసం అప్రమత్తంగా ఉండాలన్న కలెక్టర్ నేడు విద్యాసంస్థలకు సెలవు
అత్యధికంగా తిరువూరులో..
పులిచింతల సమాచారం
ఎన్టీఆర్ జిల్లా
గురువారం శ్రీ 24 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
7
నెట్‌వర్క్: గణాధిపతుల విగ్రహ నిమజ్జనాలు జిల్లాలో కొనసాగుతున్నాయి. బుధవారం జోరువానలోనూ గ్రామోత్సవాల నడుమ గణనాథులు నిమజ్జనానికి తరలివెళ్లారు.
నెట్‌వర్క్: జిల్లా వ్యాప్తంగా వీఆర్‌ఏల నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ అంబేడ్కర్ విగ్రహానికి బుధవారం వినతి పత్రాలు అందజేశారు.
విజయవాడలోని రామవరప్పాడు రింగ్ వద్ద జలమయమైన జాతీయ రహదారిపై వాహనదారుల పాట్లు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సహాయం అందేలా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను జిల్లా కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వర్షాల పరిస్థితి, ప్రజల నుంచి ఇప్పటివరకు అందిన ఫిర్యాదులు, వాటిపై అధికారులు తీసుకున్న చర్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రెండు గంటలకోసారి జిల్లాలో వర్షపాతం వివరాలను నమోదు చేయాలన్నారు.
చింతలపాడు(తిరువూరురూరల్): చింతలపాడులో బుధవారం ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో పలు నివాస గృహాలు ధ్వంసమయ్యాయి. రేకుల ఇళ్లు, పెంకుటిళ్లు దెబ్బతిని ఐదు కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. ఇళ్లపైన వాటర్ ట్యాంకులు సైతం గాలికి కొట్టుకుపోయాయి. ఇళ్ల పైకప్పు కూలి ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిని తిరువూరు ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ధ్వంసమైన ఇళ్లను తిరువూరు ఆర్డీఓ ఎ.కుమార్ సందర్శించి ఆసుపత్రిలోని బాధితులను పరామర్శించారు.
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తీవ్రవాయుగుండంగా మారడంతో మంగళవారం రాత్రి నుంచి జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. గురువారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు. కాగా బుధవారం జిల్లా అంతటా విస్తారంగా వర్షం కురవటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అధికారులతో మాట్లాడి అప్రమత్తం చేశారు.
జనాల అవస్థలు..
తీవ్రవాయుగుండం ప్రభావంతో బుధవారం ఎడతెరిపి లేని వర్షం కురవటంతో జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. బయటకు వెళ్లేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నారు. కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు వానలో తడిసి వెళ్లాల్సి వచ్చింది.
విజయవాడలో రోడ్లు జలమయం..
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి విజయ వాడ లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచి అక్కడక్కడ ట్రాఫిక్‌కు అంత రాయం ఏర్పడింది. బస్టాండ్, రైల్వే అండర్ బ్రిడ్జి, బీఎస్‌ఎన్‌ఎల్, బెంజి సర్కిల్‌లో నీరు నిలిచాయి. భవానీపురం హెచ్‌బీ కాలనీలో ఓల్డ్ ఎంఐజీలో పాత ఇళ్లను ఖాళీ చేయాలని కార్పొరేషన్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గతంలో పాత ఇళ్ల శ్లాబులు పెచ్చులూడిన ఘటనల నేపథ్యంలో ఇళ్లను ఖాళీ చేసి బంధువుల ఇళ్లకు వెళ్లాలని లేదా పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు.
రైతులకు కాస్త ఊరట..
రెండు రోజుల పాటు జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించిన నేపథ్యంలో రైతులకు కాసింత ఊరట కలిగింది. అయితే గత రెండు నెలలుగా సాగునీరు రైతులకు అందకపోవటంతో ప్రత్యామ్నాయ వనరులు ఉపయోగించి సాగు చేస్తున్నారు. అయితే ఈ వర్షం పంటలు ఎండిపోకుండా ఉపయోగపడుతుందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఉద్యానపంటలకు సంబంధించి ఈ వర్షం వల్ల ఎటువంటి ప్రమాదం లేదని ఇదే వర్షం మరో రెండు, మూడు రోజులు పాటు కురిస్తే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
విద్యార్థుల భద్రత నేపథ్యంలో..
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు గురువారం సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. జిల్లాలో కొనసాగుతున్న భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, విద్యార్థుల భద్రతను పరిగణనలోకి తీసుకుని సెలవు ప్రకటిస్తున్నామన్నారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో తీవ్రవాయుగుండం ప్రభావంతో బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య 28.51మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. జిల్లాలో అత్యధికంగా తిరువూరు మండలంలో 97.2 మిల్లీమీటర్లు, రెడ్డిగూడెంలో 59.4, విస్సన్నపేటలో 55.8 మిల్లీమీటర్లు, జి. కొండూరులో 35.2, గంపలగూడెంలో 27.4, విజయవాడ ఈస్ట్‌లో 27.4, వీరులపాడులో 26.8, ఎ. కొండూరులో 26.6, విజయవాడ రూరల్‌లో 24.8, విజయవాడ సెంట్రల్‌లో 24.6, విజయవాడ వెస్ట్‌లో 24.6, ఇబ్రహీంపట్నంలో 23.4, విజయవాడ నార్త్‌లో 23.4, మైలవరంలో 22.4, కంచికచర్లలో 16.0 , వత్సవాయిలో 12.8, నందిగామలో 10.8, జగ్గయ్యపేటలో 10.6 పెనుగంచిప్రోలులో 10.6, చందర్లపాడులో 10.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
మొఘల్రాజపురంలో జలమయమైన రోడ్డు
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 27.3726 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజీల ద్వారా వెళుతోంది.


