సమాజ గమనాన్ని నిర్దేశించేది న్యాయశాస్త్రం | - | Sakshi
Sakshi News home page

సమాజ గమనాన్ని నిర్దేశించేది న్యాయశాస్త్రం

Sep 13 2026 9:10 AM | Updated on Sep 13 2026 9:10 AM

పెనమలూరు: సమాజ గమనాన్ని నిర్దేశించేది న్యాయశాస్త్రమేనని కేంద్ర ప్రభుత్వ లెజిస్లేటివ్‌ డిపార్ట్‌మెంట్‌ అడిషనల్‌ సెక్రటరీ డాక్టర్‌ రామజోగారావు కాశీభట్ల అన్నారు. సిద్ధార్థ యూనివర్సిటీలో స్కూల్‌ ఆఫ్‌ లా మొదటి సంవత్సరం విద్యార్థులకు శనివారం జరిగిన పరిచయ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. విద్యార్థులు సంప్రదాయ పద్ధతులతో పాటు డిజిటల్‌ విధానం ద్వారా చట్టాల్లో వస్తున్న మార్పులను గమనించాలన్నారు. దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఉపకుల పతి డాక్టర్‌ సూర్యప్రకాష్‌రావు మాట్లాడుతూ న్యాయ శాస్త్రం ప్రధాన ఉద్దేశం సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రా తృత్వం వంటి రాజ్యాంగ సూత్రాలు అమలు చేయట మేనన్నారు. ఉపకులపతి డాక్టర్‌ పి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎస్‌వీడీ సిద్ధార్థ లా కాలేజీ సిద్ధార్థ యూనివర్సిటీలో విలీనమైందన్నారు. బీఏ ఎల్‌ఎల్‌బీ, బీబీఏ ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సులతో నూతన విద్యా సంవత్సరం ప్రారంభించామన్నారు. లా స్కూల్‌ డీన్‌ డాక్టర్‌ చెన్నుపాటి దివాకర్‌బాబు, ప్రో ఉప కులపతి డాక్టర్‌ రత్నప్రసాద్‌, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ రవిచంద్‌, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement