మచిలీపట్నానికి చెందిన రాజు అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఏడాదిగా స్పాండిలైటిస్‌తో బాధపడుతున్నాడు. అనేక చోట్ల వైద్యుల సూచనలతో మందులను వాడుతున్నా ఫలితం కనిపించలేదు. ఓ స్నేహితుడు ఫిజియోథెరపీ చేయించుకుంటే ఉపశమనం ఉంటుందని సలహా ఇస్తే ప్రయత్నించారు. దీంతో నెల రోజుల | - | Sakshi
Sakshi News home page

మచిలీపట్నానికి చెందిన రాజు అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఏడాదిగా స్పాండిలైటిస్‌తో బాధపడుతున్నాడు. అనేక చోట్ల వైద్యుల సూచనలతో మందులను వాడుతున్నా ఫలితం కనిపించలేదు. ఓ స్నేహితుడు ఫిజియోథెరపీ చేయించుకుంటే ఉపశమనం ఉంటుందని సలహా ఇస్తే ప్రయత్నించారు. దీంతో నెల రోజుల

Sep 8 2026 2:11 AM | Updated on Sep 8 2026 2:11 AM

హృదయ సంబంధ రోగులకూ థెరపీలు పక్షవాతం రోగులు వేగంగా కోలుకునేందుకు దోహదం దీర్ఘకాలిక నొప్పులకు ఉపశమనం ప్రతి ఆస్పత్రిలో ఫిజియోథెరపిస్టు ఒక్క విజయవాడలోనే 50కి పైగా ఫిజియో సెంటర్లు

దీర్ఘకాలిక నొప్పులకు థెరపీలు

దాదాపు అన్ని రకాల పక్షవాతాలను ముందే నివారించవచ్చు. శరీర కదలికలు, వ్యాయామాల ద్వారా స్ట్రోక్‌ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో ఫిజియోథెరపిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారు.

కార్డియోవాస్కులర్‌ వ్యాధుల నివారణలో థెరపిస్టుల పాత్ర కీలకం. గుండె సంబంధిత సమస్యలను అరికట్టడానికి, వాటిని అదుపులో ఉంచుకోవడానికి క్రమమైన శారీరక శ్రమపై అవగాహన కలిగిస్తున్నారు.

ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితికి తగినట్లుగా సురక్షితమైన వ్యాయామాలను ఫిజియోథెరపిస్ట్‌ సూచిస్తారు.

ఏ వయసులోనైనా శారీరక శ్రమ చేయడం వల్ల ఆరోగ్యం, స్వయం సమృద్ధి, జీవిత నాణ్యత పెరుగుతాయి. ఆ దిశగా ఫిజియోథెరపిస్టులు ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు.

లబ్బీపేట(విజయవాడ తూర్పు)/మచిలీపట్నంటౌన్‌: వైద్య రంగంలో ఫిజియోథెరపీ నేడు అత్యంత కీలకంగా మారింది. మొండి నొప్పులకు థెరపీలతో ఉపశమనం కలిగించడమే కాక.. సుఖ ప్రసవం కోసం, హృదయ సంబంధ వ్యాధిగ్రస్తులు, పక్షవాతం రోగుల చికిత్సలో ఫిజియోథెరపీకి ప్రాధాన్యం పెరిగింది. అంతేకాదు శస్త్ర చికిత్స తర్వాత కండరాలు సాధారణ స్థితికి రావాలంటే ఫిజియోథెరపీ చేయాల్సిందే. ఇప్పుడు ప్రతి ఆస్పత్రిలో వైద్యులతో పాటు ఫిజియోథెరపిస్టులు సేవలు అందిస్తున్నారు. అంతేకాదు నగరంలో దాదాపు వందకు పైగా ఫిజియోథెరపీ క్లినిక్‌లు ఏర్పాటయ్యాయంటే దాని ప్రాధాన్యం ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఏటా సెప్టెంబర్‌ 8న ప్రపంచ ఫిజియోథెరపీ డేగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ‘హృదయ సంబంధ వ్యాధులు, పక్షవాతం నిర్వహణ, పునరావాసంలో ఫిజియోథెరపీ, శారీరక కార్యకలాపాల పాత్ర’ అనే నినాదంతో జరుపుకొంటున్నారు.

మొండి నొప్పులకు చెక్‌..

వెన్నుముక నొప్పి, మెడనొప్పి వంటి వాటికి శస్త్ర చికిత్సలతో సంబంధం లేకుండా ఫిజియోథెరపిస్టులు విముక్తి కలిగిస్తున్నారు. ముఖ్యంగా మోకీలు మార్పిడి, తుంటికీళ్లు మార్పిడి శస్త్ర చికిత్సల తర్వాత మరలా కండరాలు సాధారణ స్థితికి రావడంలో ఫిజియోథెరపిస్టుల పాత్ర కీలకంగా ఉంటుంది. బైపాస్‌ సర్జరీలు, ఇతర మేజర్‌ శస్త్ర చికిత్సలు తర్వాత కూడా ఫిజియో థెరపీ అవసరం ఉంటుంది. అంతేకాదు శ్వాసకోశ సమస్యలకు బ్రీతింగ్‌ వ్యాయామాలు, యోగా థెరపీలతో విముక్తి కలిగిస్తున్నారు. ఇలా వైద్య పరంగా అనేక సమస్యలకు ఫిజియోథెరపిస్టులు పరిష్కారం చూపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement