ప్రగతి ప్రదాత | - | Sakshi
Sakshi News home page

ప్రగతి ప్రదాత

Sep 5 2026 7:19 AM | Updated on Sep 5 2026 7:19 AM

మదిమదిలో వైఎస్సార్‌ జ్ఞాపకాలు పదిలం ● 2008లో అవనిగడ్డ మండలం పులిగడ్డ వద్ద కృష్ణా డెల్టా ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. కృష్ణా డెల్టా పరిధిలో 13.6 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా రూ.4,573 కోట్లతో ఆధునికీకరణ పనులకు పరిపాలనా అనుమతులు ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో రూ.2,180కోట్లు వెచ్చించారు. వైఎస్సార్‌ హయాంలోనే ఈ పనులు 40 శాతం పూర్తి కావడం విశేషం. డెల్టాకు ఆయువుపట్టు అయిన పులిచింతల ప్రాజెక్టును నిర్మించారు. ● 2008 ఏప్రిల్‌ 23న తేదీన రూ.1,500 కోట్లతో బందరు పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత పోర్టు పనులను ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక పరుగులు పెట్టించారు. ● అవనిగడ్డ, విజయవాడ మధ్య ప్రయాణ దూరాన్ని తగ్గించేందుకు అప్పటి వరకు సింగిల్‌ రోడ్డుగా ఉన్న కరకట్ట రహదారిని రెండు లైన్లకు విస్తరించి అభివృద్ధి చేశారు. నాగాయలంక లోని భావదేవరపల్లిలో రాష్ట్రంలో తొలి మత్స్యకార పాలిటెక్నిక్‌ కళాశాలను ఏర్పాటు చేశారు. ● నూజివీడులో ప్రతిష్టాత్మక ట్రిపుల్‌ ఐటీని ఏర్పాటు చేయడంతో విద్యార్థులు సాంకేతిక విద్యను ఉచితంగా అందుకుంటున్నారు.

జలయజ్ఞంతో కృష్ణాడెల్టాకు మంచిరోజులు పులిచింతల ప్రాజెక్టును పూర్తిచేసిన దార్శనికుడు నేడు మహానేత వైఎస్సార్‌ 17వ వర్ధంతి

నేడు వర్ధంతి కార్యక్రమాలు..

మరపురాని మహానేత..

సాక్షి ప్రతినిధి, విజయవాడ: రైతన్న బాగుండాలని కలలు కన్నారు.. ఆ కలలను సాకారం చేసి చూపించారు. కృష్ణాడెల్టా స్థిరీకరణ కోసం పులిచింతల ప్రాజెక్టు కట్టారు. 150ఏళ్ల డెల్టాను ఆధునికీకరించాలని తలపెట్టారు. ఉమ్మడి కృష్ణా జిల్లాతో మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డికి ఉన్న అనుబంధం విడదీయరానిది. ఆయన ముఖ్యమంత్రి కాగానే జలయజ్ఞం చేపట్టి రైతుల పాలిట అపర భగీరథుడయ్యారు. ఆరోగ్య శ్రీ పథకం కింద పేదలకు సైతం కార్పొరేట్‌ వైద్యం అందించి ఎంతో మంది ప్రాణాలను నిలిపి వారి కుటుంబాలకు పెద్ద దిక్కుగా నిలిచారు. నేడు వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా ఉమ్మడి జిల్లా ప్రజలు ఆయన చేసిన మేలును మనసారా స్మరించుకుంటున్నారు.

ఉమ్మడి జిల్లాపై చెరగని సంతకం..

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉమ్మడి కృష్ణా జిల్లాపై చెరగని ముద్ర వేశారు. సంక్షేమం, అభివృద్ధి పథకాలు రెండింటినీ ఒకేసారి అమలుచేసి అన్ని వర్గాల ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు. కృష్ణా జిల్లాలో రైతుల పాలిట అపర భగీరథుడయ్యారు. ఆరోగ్యశ్రీతో పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఎంతో మంది పేద విద్యార్థులను ఇంజినీర్లుగా, డాక్టర్లుగా, అధికారులుగా తీర్చిదిద్దారు.

అభివృద్ధిపై ‘రాజన్న’ ముద్ర

ఇలా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి ఇప్పటికీ ఉమ్మడి కృష్ణా ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు వైఎస్సార్‌. ఆయన వర్ధంతి కార్యక్రమాలు బుధవారం జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ఆయన అభిమానులు, వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. పలుచోట్ల సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement