గన్నవరం: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం)లో నూతనంగా నిర్మిస్తోన్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణాన్ని నిర్ణీత గడువులోపు పూర్తిచేసే విధంగా పనులను వేగవంతం చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అధి కారులను ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణ పనులను మంగళవారం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ విపిన్‌కుమార్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ట్రాన్సిట్ టెర్మినల్ భవనంలో ఎయిర్‌పోర్ట్ అధికారులు, టెర్మినల్ కాంట్రాక్ట్ సంస్థ్ధ ప్రతినిధులతో ఆయన సమీక్ష జరిపారు. టెర్మినల్ నిర్మాణ పనుల పురోగతిని అధికారులు ఆయనకు వివరించారు. రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ.. టెర్మినల్ నిర్మాణ పనులను దసరా నవరాత్రుల నాటికి పూర్తి చేయాలని సూచించారు. తెలుగు, సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా, కృష్ణానది, ఇంద్రకీలాద్రి ఆలయ ప్రత్యేకతలను ప్రతిబింబించేలా టెర్మినల్‌ను తీర్చిదిద్దాలని తెలిపారు. ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ ఎల్.లక్ష్మీకాంతరెడ్డి, పలు విభాగాల అధి పతులు పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు


