జనసేన నుంచి వైఎస్సార్‌ సీపీలో చేరిక | - | Sakshi
Sakshi News home page

జనసేన నుంచి వైఎస్సార్‌ సీపీలో చేరిక

Sep 9 2026 3:22 AM | Updated on Sep 9 2026 3:22 AM

జగ్గయ్యపేట అర్బన్‌: జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు, వత్సవాయి మండలం మంగొల్లు గ్రామాలకు చెందిన పలువురు కాపు సామాజిక వర్గ ముఖ్య నేతలు జనసేన పార్టీని వీడి వైఎస్సార్‌ సీపీలో చేరారు. స్థానిక పీవీఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో మంగళవారం జరిగిన నియోజకవర్గ స్థాయి వైఎస్సార్‌ సీపీ సంస్థాగత సన్నాహక సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ తన్నీరు నాగేశ్వరరావు, నియోజకవర్గ పరిశీలకుడు ఆళ్ల చల్లారావు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. చిల్లకల్లు గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకులు సుంకర వేణు, సుంకర ఆంజనేయులు, సంపత్‌ సైదేశ్వరరావు, వారితో పాటు 8 కుటుంబాలు వైఎస్సార్‌ సీపీ గ్రామ అధ్యక్షుడు దొంగల సింహాద్రి ఆధ్వర్యంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు. అలాగే వత్సవాయి మండలం మంగొల్లు గ్రామానికి చెందిన జనసేన నాయకుడు చరణం కృష్ణారావు ఆ గ్రామ వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు బొల్లం కిరణ్‌ ఆధ్వర్యంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు.

ఆహ్వానించిన అవినాష్‌, తన్నీరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement