ముగిసిన ఎఫ్‌సీఐ సాంస్కృతిక పోటీలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన ఎఫ్‌సీఐ సాంస్కృతిక పోటీలు

Sep 9 2026 3:22 AM | Updated on Sep 9 2026 3:22 AM

విజయవాడ కల్చరల్‌: భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన దక్షిణ మండల అంతర్‌ ప్రాంతీయ సాంస్కృతిక పోటీలు విజయవాడ ఎంజీ రోడ్డులోని ఎంబీ భవన్‌లో మంగళవారం ముగిశాయి. తమిళనాడు, కర్నాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, దక్షిణ మండల జోనల్‌ కార్యాలయానికి చెందిన ఉద్యోగులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. హిందీ, తెలుగు చిత్ర గీతాలు ఆలపించారు. లఘు నాటికలు, సోలో, బృంద నృత్యాలను ప్రదర్శించారు. ముగింపు సభకు ముఖ్య అతిథిగా సౌత్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ జస్మినితా లాజరస్‌ విజేతలకు బహుమతులు అందజేశారు. ఉద్యోగులలో సృజనాత్మకతను వెలికి తీసే ఇటువంటి పోటీలు అవసరమన్నారు. తమిళనాడు జట్టు పలు విభాగాలలో విజేతగా నిలిచింది. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రీజియన్‌ జీఎం విజయకుమార్‌ యాదవ్‌, ప్రాంతీయ రీజియన్‌ జీఎం సమీర్‌కుమార్‌ వర్మ, సంస్థ అధికారులు విజయ్‌కుమార్‌ యాదవ్‌, సమీర్‌కుమార్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement