నేపాల్‌కు వెళ్లి అదృశ్యం? | - | Sakshi
Sakshi News home page

నేపాల్‌కు వెళ్లి అదృశ్యం?

Aug 28 2026 4:27 AM | Updated on Aug 28 2026 4:27 AM

అందని కానూరువాసి క్షేమ సమాచారం

పెనమలూరు: కానూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ చొప్పరపు రమేష్‌(53) యాత్రకని నేపాల్‌కు వెళ్లి అదృశ్యమవ్వడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెల కొంది. అధికారులు కనీస సమాచారం ఇవ్వకపోవడంతో కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. వివరాల్లోకి వెళితే కానూరు వసంతగోవింద్‌ అపార్టు మెంట్‌లో రమేష్‌ కుటుంబ సభ్యులు ఉంటున్నారు. అతను 15 సంవత్సరాలుగా కతార్‌ దేశం దోహాలో సాఫ్ట్‌వేర్‌ అర్కెటిక్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. అతను ఈ నెలలో కానూరుకు వచ్చి తిరిగి 14వ తేదీన కతార్‌కు వెళ్లారు. అక్కడ నుంచి నేపాల్‌ యాత్రకు వెళ్లారు. ఆయన మంగళవారం నేపాల్‌ నుంచి కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడారు. బుధవారం తాను యాత్రకు బయలుదేరానని మెసేజ్‌ చేశారు. ఆ తర్వాత అతని నుంచి సమాచారం లేదు.

కుటుంబ సభ్యుల్లో ఆందోళన

నేపాల్‌లో వరద విలయం కారణంగా భారతీయులు గల్లంతైన ఘటన పై ఆందోళన నెలకొంది. అయితే మిస్సింగ్‌ జాబాతాలో రమేష్‌ పేరు మచిలీపట్నం కలెక్టరేట్‌కు వచ్చింది కాని పూర్తి సమాచారం లేదు. ఏంజరుగుతుందో సమాచారం ఇవ్వాలని కటుంబ సభ్యులు అధికారులను కోరుతున్నారు. రమేష్‌ భార్య సనీత పటమటలంక వీఎంసీ బాలుర పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేస్తున్నారు. కుమారుడు సాయిఅఖిల్‌ జర్మనీలో ఉద్యోగి. కుమార్తె అల్లుడు హైదరాబాద్‌లో ఉన్నట్లు సమాచారం. రమేష్‌ వివరాలు అందితే ఇవ్వాలని వారు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement