● అభినయం.. అమోఘం.. ‘అజేయ’ం ఆంధ్ర రాష్ట్రానికి అజరామరమైన కీర్తి ప్రతిష్టలు అందించిన అపురూపమైన నాట్యకళ కూచిపూడి. ఈ నాట్యాన్ని మరింత శోభాయమానంగా చేసే ప్రక్రియ రూపానురూపం. అంటే సీ్త్ర పాత్రల్లో పురుషులు ఒదిగిపోయి నర్తించడం. అటువంటి నాట్య కళను అవపోసన పట్టి.. అతివలకే అసూయ పుట్టేంతగా వయ్యారాలొలికిస్తూ.. ఆహార్యం, అభినయాలతో చూపరులను నిజంగా అమ్మాయే నాట్యం చేస్తోందా! అనేంతలా భ్రమింపజేస్తూ తన కంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కళాతేజం.. కూచిపూడి నాట్య పుంజం.. విజయవాడకు చెందిన నాట్యాచార్యుడు అజయ్‌కుమార్. అతివలే అసూయపడేలా.. రూపానురూప కళాతేజం అజయ్‌కుమార్ విజయవాడ కల్చరల్: పురుషుడే సీ్త్ర వేషం ధరించి, ఆ పాత్రను తన అభినయంతో ఆవిష్కరించడం కత్తిమీద సాములాంటింది. వేషం మార్చుకోవడం కాదు.. పాత్రలోని భావాన్ని సౌందర్యాన్ని, లాస్యాన్ని ప్రేక్షకుల హృదయాలకు చేరవేయడం అసలైన సవాల్. ప్రముఖ నాట్యాచార్యులు వేదాంతం సత్యనారాయణ శర్మ, వేదాంతం రాఘవయ్య, చింతా కృష్ణమూర్తి, చెంత వెంకటరామయ్య, వేదాంతం జగన్నాథ శర్మ, పసుమర్తి కృష్ణమూర్తి, పసుమర్తి వేణుగోపాల శర్మ ఈ కళలో ఆరితేరిన ఆచార్యులు. ప్రస్తుత వర్ధమాన కళాకారుల్లో అలాంటి ప్రతిభా పాటవాలు చూపిస్తున్న వ్యక్తి విజయవాడకు చెందిన నాట్యాచార్యుడు అజయ్‌కుమార్. నాలుగేళ్ల వయస్సులో ఆయన నాట్య సాధన మొదలైంది. రూపానురూపంలో తనదైన ముద్రతో కూచిపూడి నృత్య సంప్రదాయానికి జీవం పోస్తున్నారు. సత్యభామ, మోహిని, గిరిజ, లలితాదేవి, పద్మావతి, ఆమ్రపాలి, వరూధిని, దుర్గాదేవి తెలుగుతల్లి, గోదాదేవి పాత్రల్లో ఒదిగిపోయారు.
విజయవాడ నుంచి ఖండాంతరాలకు..
అజయ్‌కుమార్ కళా ప్రస్థానం ఒక నగరానికే పరిమితం కాలేదు. దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రదర్శనలు ఇచ్చిన ఆయన తన బృందంతో విదేశీ వేదికలపైనా కూచిపూడి నాట్యాన్ని ఆవిష్కరించారు. అమెరికా, లండన్, దుబాయ్, శ్రీలంక, మలేషియా, మస్కట్ ఇలా పలు దేశాలలో ఆయన బృందం ప్రదర్శనలు ఇచ్చింది.
నృత్యరూపకాలకు రూపకల్పన..
15 రూపకాలకు నృత్య దర్శకత్వం వహించారు. భ్రమరాంబికా విజయం, తెలుగుతల్లి, మోహినీ భస్మాసుర, ఆమ్రపాలి నృత్య రూపకాలు పేరుతెచ్చి పెట్టాయి. కళను నేర్చుకోవడం ఒక ఎత్తయితే నేర్చుకున్న కళను మరో తరానికి అందించడం మరో ఎత్తు. అజయ్‌కుమార్ రెంటినీ కొనసాగిస్తున్నారు. నాట్యాచార్యుడు కేవీ సత్యనారాయణ ప్రోత్సాహంతో హంసధ్వని కూచిపూడి నృత్యాలయం స్థాపించి నాట్యంలో శిక్షణనిస్తున్నారు.
సత్కారాలు.. పురస్కారాలు..
రూపాను రూపంపై చేసిన పరిశోధనకు యూకే విశ్వ విద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందు కున్నారు. సంస్కారభారతి, దృశ్యవేదిక, రామన్ ఫౌండేషన్ వంటి సంస్థలు ఘనంగా సత్కరించాయి. ముంబైకి చెందిన నాట్య సంస్థ ఆయన నృత్య సేవలను గుర్తించి శింగారమణి బిరుదుతో గౌరవించింది. విజయవాడలో జరిగిన నృత్య కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా సత్కారం అందుకున్నారు.
సీ్త్ర పాత్రలో అజయ్‌కుమార్
సీ్త్ర పాత్రల్లో ఒదిగిపోయే నాట్యాచార్యుడు వర్ధమాన కళాకారుల్లోకెల్లా విజయవాడ వాసిది అసామాన్య ప్రతిభ కూచిపూడి నృత్యాన్ని మరింత శోభాయమానం చేస్తూ ప్రదర్శనలు
ఇదీ ప్రస్థానం..
1982 జనవరి 6వ తేదీన జన్మించిన అజయ్ తల్లిదండ్రులు సత్యవతి, రామ సుబ్బయ్య. ఆయన దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ నృత్య కళాశాలలో కూచిపూడి నాట్యాచార్యులుగా పనిచేస్తున్నారు. దూర దర్శన్‌లో ఏ గ్రేడ్ ఆర్టిస్ట్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి కూచిపూడి నాట్యంలో ఎంఏ పూర్తి చేశారు. నాలుగేళ్ల నాడే పినతల్లి లక్ష్మీదేవి వద్ద నాట్యశిక్షణకు శ్రీకారం చుట్టారు. చిన్నారి బుడిబుడి అడుగులు నాట్యభంగిమలుగా మారాయి. నృత్యం మీద ఆసక్తి అనురక్తిగా మారింది. నాట్యగురువులు ఏలేశ్వరపు వెంకటేశ్వర్లు, డాక్టర్ కేవీ సత్యనారాయణ వద్ద నృత్య శిక్షణలో ఆచార్యులుగా మారారు.
● అభినయం.. అమోఘం.. ‘అజేయ’ం
ఆంధ్ర రాష్ట్రానికి అజరామరమైన కీర్తి ప్రతిష్టలు అందించిన అపురూపమైన నాట్యకళ కూచిపూడి. ఈ నాట్యాన్ని మరింత శోభాయమానంగా చేసే ప్రక్రియ రూపానురూపం. అంటే సీ్త్ర పాత్రల్లో పురుషులు ఒదిగిపోయి నర్తించడం. అటువంటి నాట్య కళను అవపోసన పట్టి.. అతివలకే అసూయ పుట్టేంతగా వయ్యారాలొలికిస్తూ.. ఆహార్యం, అభినయాలతో చూపరులను నిజంగా అమ్మాయే నాట్యం చేస్తోందా! అనేంతలా భ్రమింపజేస్తూ తన కంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కళాతేజం.. కూచిపూడి నాట్య పుంజం.. విజయవాడకు చెందిన నాట్యాచార్యుడు అజయ్‌కుమార్.
రూపానురూప కళాతేజం అజయ్‌కుమార్