నూతన అన్నదానం, లడ్డూపోటులు సిద్ధం ● 21న ప్రారంభోత్సవాలు ● అధికారులతో సమీక్షలో దుర్గగుడి ఈవో శీనానాయక్
గేదెల చోరీ ముఠా అరెస్టు
నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
జి.కొండూరు: వరుసగా గేదెల చోరీలకు పాల్పడుతున్న నలుగురు ముఠాను జి.కొండూరు పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండల పరిధి వెల్లటూరు గ్రామానికి చెందిన మోదుగు ఐహిల్‌బాబుకు చెందిన పాడి గేదెను జూన్ 6వ తేదీన దొంగలు చోరీ చేశారు. ఆ తర్వాత ఇదే గ్రామానికి చెందిన బొడ్డు రమేష్‌బాబుకు చెందిన రెండు గేదెలను జూన్ 24వ తేదీన చోరీ చేశారు. ఈ క్రమంలో ఇద్దరు బాధితులు జి.కొండూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్‌ఐ సతీష్‌కుమార్ సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా విచారణ చేపట్టగా వెల్లటూరు గ్రామానికి చెందిన కొండా తరుణ్, మూల కుమార్‌బాబు, నిమ్మగడ్డ మహేష్, కొండా అనిల్ ముఠాగా గేదెలను చోరీ చేస్తున్నట్లు గుర్తించారు. ఈ నలుగురు నిందితులను శుక్రవారం అరెస్టు చేసిన పోలీసులు, బాధితుడు బొడ్డు రమేష్‌బాబుకు చెందిన రెండు గేదెలను రికవరీ చేసి అప్పగించారు. అయితే మరో బాధితుడు మోదుగు ఐహిల్‌బాబుకు చెందిన గేదెను చోరీ చేసిన అనంతరం నిందితులు మాంసానికి విక్రయించినట్లు విచారణలో తేలింది. ఈ నలుగురు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ సతీష్‌కుమార్ తెలిపారు. చోరీకి వినియోగించిన ఒక ట్రక్కు వాహనాన్ని సైతం పోలీసులు సీజ్ చేశారు. బెయిల్ పిటీషన్‌పై కౌంటర్‌కు వాయిదా విజయవాడలీగల్: కృష్ణలంకకు చెందిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న ఏ5 కై తేపల్లి బాబూరావు, ఏ6 గొరిపర్తి సాంబయ్యల తరఫున న్యాయవాది జి.సాంబశివరావు బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ 8వ అదనపు జిల్లా న్యాయస్థానం న్యాయమూర్తి ఈనెల 10వ తేదీకి వాయిదా వేశారు. ఇదే కేసులో మరో ఇరువురు నిందితులు పోతర్లంక అశోక్‌కుమార్, జంగం నాని తరఫున దాఖలైన బెయిల్ పిటీషన్లు సాంకేతిక కారణాలతో న్యాయమూర్తి వెనక్కి పంపుతూ, సరిచేసి మరోసారి పిటీషన్లు దాఖలు చేయాలన్నారు.
మద్యం రవాణా కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నమోదు చేసిన కేసులో చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, రాజ్ కేసిరెడ్డి, కారుమూరి సునీల్‌లను 5 రోజులు కస్టడీ కోరుతూ సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో దాఖలు చేసిన విషయం విదితమే. దీనిపై డిఫెన్స్ తరఫు సీనియర్ న్యాయవాది గోలి నరసింహారావు విచారణకు సమయం కోరడంతో న్యాయమూర్తి ఎల్.తేజోవతి ఈనెల 12వ తేదీకి వాయిదా వేశారు.
● 21న ప్రారంభోత్సవాలు ● అధికారులతో సమీక్షలో దుర్గగుడి ఈవో శీనానాయక్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో నూతనంగా నిర్మించిన అన్నదానం, లడ్డూపోటులను ఈ నెల 21వ తేదీన ప్రారంభోత్సవం జరగనున్నాయి. భవనాల ప్రారంభోత్సవానికి సంబంధించి దేవదాయ శాఖ నుంచి అన్ని అనుమతులు రావడంతో సుముహూర్తాన్ని ఖరారు చేశారు. మాస్టర్ ప్లాన్‌లో భాగంగా నిర్మించిన ఈ రెండు భవానాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం చంద్రబాబునాయుడు వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. దీనిపై ప్రభుత్వ పెద్దల వైపు నుంచి ఆమోదం తెలపాల్సి ఉండగా, అన్నదాన భవనం, లడ్డూపోటు భవనాల్లో చేపట్టాల్సిన ఏర్పాట్ల గురించి దుర్గగుడి ఈవో శీనానాయక్ ఆలయ అధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. లడ్డూపోటు ప్రారంభోత్సవం నాటికి యంత్రాలు, విద్యుదీకరణ, ప్రసాదాల తయారీ ప్రక్రియ ఎక్కడా అంతరాయం కలుగకుండా చూడాలని ఈవో ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శ్రావణ మాసంలో నూతన భవనాలను ప్రారంభోత్సవం చేయడం వల్ల ఎక్కువ మంది భక్తులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉందన్నారు. సమావేశంలో ఏసీ రంగారావు, డీఈవో కిషోర్‌కుమార్, ఏఈవోలు ఎన్. రమేష్‌బాబు, చంద్రశేఖర్, ఈఈ ఎల్.రమాదేవి, డీఈఈలు, ఏఈఈలతో పాటు ఇతర ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మద్యం రవాణా కేసులో..