తెలంగాణలోని భీమా–1, భీమా–2, నెట్టెంపాడు, కోయిలసాగర్, కల్వకుర్తి లిఫ్ట్‌లు పని చేస్తున్నాయి. జూరాల కుడి, ఎడమ కాలువలకు నీరు వదిలారు. శ్రీశైలం రిజర్వాయర్‌లోకి 2.42 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి నీటి మట్టం 864 అడుగులు దాటింది. అయినా డెల్టాకు నీరు ఇవ్వడం కుదరదని ప్రభుత్వం చెప్పడం దారుణం. పులిచింతలలో ఉన్న 29 టీఎంసీల నుంచి రోజుకు నాలుగువేల క్యూసెక్కులు విడుదల చేస్తే సాగుకు ఇబ్బంది ఉండదు.
– ఎం.వి.ఎస్.నాగిరెడ్డి, ఏపీ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్


