బెల్టు బేరం.. రాబడి అధనం | - | Sakshi
Sakshi News home page

బెల్టు బేరం.. రాబడి అధనం

Jul 29 2026 2:10 AM | Updated on Jul 29 2026 2:10 AM

పల్లెలు, పట్టణాల్లో విచ్చలవిడిగా బెల్టుషాపుల నిర్వహణ కూటమి ప్రభుత్వంలో ఏరులై పారుతున్న మద్యం బెల్ట్‌ షాపుల ఏర్పాటుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మంత్రి లోకేశ్‌ను నిలదీసినా ఫలితం మాత్రం శూన్యం

సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో సుస్తీచేసి ఏదైనా ప్రభుత్వాస్పత్రికి వెళ్తే మందుబిళ్లలు దొరుకుతాయో లేదో కానీ పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా వీధివీధిలో మద్యం పుష్కలంగా లభిస్తోంది. ప్రజలకు నాణ్యమైన మద్యం అందిస్తున్నా మని బహిరంగంగా ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎవరైనా బెల్ట్‌షాపులు ఏర్పాటు చేస్తే తాను బెల్ట్‌ తీయాల్సి వస్తుందని వార్నింగ్‌ ఇచ్చారు. అయితే తెలుగు తమ్ముళ్లు ఆ హెచ్చరికలను లెక్కలోకి తీసుకోలేదు. ఏకంగా బెల్టుషాపులకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నారు. హెచ్చు పాట పాడిన వారికే అవకాశం ఇచ్చి రూ.లక్షలు వెనకేసుకున్నారు. క్వార్టర్‌ బాటిల్‌పై రూ.20 నుంచి రూ.50 అదనంగా వసూలు చేస్తున్నారు.

వీధివీధినా బెల్ట్‌ షాపులు

ఉమ్మడి కృష్ణా జిల్లావ్యాప్తంగా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక గ్రామానికో మద్యం దుకాణం, వీధి వీధినా బెల్టుషాపులు ఏర్పాటయ్యాయి. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా పట్టణాలు, గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం లభిస్తుండటంతో చాలా మంది మద్యానికి బానిసలవుతున్నారు. వచ్చే ఆదాయం మొత్తాన్ని మద్యా నికి తగలేస్తూ కుటుంబాలను విస్మరిస్తున్నారు. బెల్ట్‌షాపులు తొలగించండి అని మహిళలు రోడ్డెక్కి వేడుకుంటున్నా అధికారులకు, పాలకులకు చెవికెక్కడం లేదు. యువత మద్యం, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని అవగాహన కల్పిస్తున్న ఈగల్‌, పోలీసు అధికారులు వీధికో బెల్టుషాపు ఉంటే అది ఎలా సాధ్యం అన్న విషయాన్ని పట్టించుకోవడంలేదు.

బెల్టు షాపులపై చర్యలేవి?

కృష్ణా జిల్లాలో 118 మద్యం దుకాణాలు, 43 బార్లు, ఎన్టీఆర్‌ జిల్లాలో 118 మద్యం దుకా ణాలు, 140 బార్లు ఉన్నాయి. ఒక్క విజయవాడ నగరంలోనే 100కి పైగా బార్‌లు ఉన్నాయి. బెల్టుషాపులు వేల సంఖ్యలో ఉన్నాయి. మైలవరం నియోజకవర్గంలో 17 మద్యం దుకాణాలు, 9 బార్లు, బెల్టు షాపులు 280కు పైగానే ఉన్నాయి. పెడన నియోజకవర్గంలో 13 మద్యం దుకాణాలతో పాటు ఒక బార్‌ ఉంది. టీడీపీ నేతల ఆధ్వర్యంలో 300లకు పైగానే బెల్టుషాపులు ఏర్పాటయ్యాయి. గన్నవరం నియోజకవర్గంలో 29 మద్యం దుకాణాలు ఉండగా, ప్రతి గ్రామంలో టీడీపీ గ్రామ పార్టీ కమిటీల ఆమోదం మేరకు ఆ పార్టీ కార్యకర్తలు 450 వరకు బెల్టు షాపులు నిర్వహిస్తున్నారు. తిరువూరు నియోజకవర్గంలో 15 మద్యం షాపులు ఉండగా బెల్టు షాపులు ఏకంగా 600 వరకు ఏర్పాటయ్యాయి. ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌ పలుమార్లు బెల్టుషాపుల నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేసినా పరిస్థితిలో మార్పు లేదు. నందిగామ నియోజకవర్గంలో ఏకంగా 250 బెల్ట్‌షాపులు ఉన్నాయి. గుడివాడ నియోజకవర్గంలో 20 వైన్‌షాపులు ఉన్నాయి. అనధికారికంగా నందివాడ మండలం జనార్దనపురం (జొన్నపాడు)లో మద్యందుకాణం నిర్వహిస్తున్నారు. 300 పైగా బెల్ట్‌షాపులు ఉన్నాయి. పామర్రు నియోజకవర్గంలో 17 మద్యం దుకా ణాలు, 250కి పైగా బెల్టుషాపులు ఉన్నాయి. పెనమలూరు నియోజకవర్గంలో 24 మద్యం దుకాణాలు, 130 వరకు బెల్టుషాపుల వరకు ఉన్నాయి. అవనిగడ్డ నియోజకవర్గంలో 21 మద్యం దుకాణాలు, రెండు బార్లు, 224 మేర బెల్టుషాపులు నడుస్తున్నాయి. చల్లపల్లి మండలం కొత్త మాజేరు గ్రామంలో మూడు వేల మంది జనాభాకు 12 బెల్టు షాపులు ఉన్నాయి. గత నెల జూన్‌ 24న మంత్రి లోకేశ్‌ అవనిగడ్డలో పర్యటించగా పులిగడ్డ పల్లెపా లెంలో మహిళలు బెల్టుషాపులపై నిలదీశారు. అయినా ఆ గ్రామంలో బెల్టుషాపులు కొనసాగుతూనే ఉన్నాయి. జగ్గయ్యపేట నియోజకవర్గంలో 18 మద్యం దుకాణాలు 300కి పైగా బెల్టుషాపులు నడుస్తున్నాయి. బెల్ట్‌ షాపు నిర్వాహకుల నుంచి ఎకై ్సజ్‌ శాఖ అధికారులకు నెలనెలా మామూళ్లు అందుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement