మా సిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టే సమయంలో జలుబు, జ్వరం, బాడీపెయిన్స్ ఉన్న వారిని గుర్తించి సమీపంలోని యూపీహెచ్‌సీ, పీహెచ్‌సీలకు వెళ్లాలని సూచిస్తున్నారు. అక్కడి వైద్యులు వారిని పరీక్షించి కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తే జీజీహెచ్‌కి రిఫర్ చేస్తున్నారు. అక్కడ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసి, అవసరాన్ని బట్టి ఆస్పత్రిలో చేర్చడం, లేదంటే హోం ఐసోలేషన్‌కు సిఫార్సు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.
– డాక్టర్ ఎ. శ్రావణ్‌బాబు,
వైద్య ఆరోగ్యశాఖాధికారి, ఎన్టీఆర్ జిల్లా


