న్యూస్‌రీల్
తిరువూరులో ఆక్రమణల తొలగింపుపై...
నేడు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్
సీపీని కలిసిన సౌత్ ఏసీపీ
లోక కల్యాణార్ధం సూర్యోపాసన
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లా
● తిరువూరు టీడీపీలో
రగులుతూనే ఉన్న రావణకాష్ఠం
● అధిష్టానం జోక్యం చేసుకున్నా వెనక్కి
తగ్గని పార్లమెంటు ముఖ్యనేత వర్గం
● కవ్వింపు చర్యలతో
రెచ్చగొడుతున్న వైనం
● రోడ్డెక్కుతున్న నియోజకవర్గ ప్రజాప్రతినిధి
7
సోమవారం శ్రీ 13 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
సాక్షి ప్రతినిధి, విజయవాడ: తిరువూరు నియోజక వర్గ టీడీపీలో విభేదాలు రచ్చకెక్కుతూనే ఉన్నాయి. నియోజకవర్గంలో పార్లమెంటు ముఖ్యనేత వర్గం కవ్వింపు చర్యలు అధిష్టానానికి సైతం తలబొప్పి కట్టిస్తున్నాయి. పార్టీ ప్రతిష్ట రోజురోజుకు మసక బారుతోంది. అక్కడ నియోజకవర్గ ప్రజాప్రతినిధిని కాదని, ప్రత్యేకంగా ఓ ఇన్‌చార్జిని ఏర్పాటు చేసి తన వర్గంతో నియోజకవర్గ ప్రజాప్రతినిధిని దెబ్బకొట్టే విధంగా వ్యవహరిస్తుండటంతో టీడీపీలో తీవ్ర అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. ఇరువురు నేతల మధ్య అంతరం నానాటికీ పెరిగిపోతోంది. దీంతో వైరి వర్గాలు బహిరంగంగా తలపడుతున్నాయి. నియోజకవర్గ ముఖ్యనేత బహిరంగంగానే నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిని ఎండగడుతూ రోడ్డెక్కడం చర్చనీయాంశంగా మారు తోంది. దీంతో అక్కడ పార్లమెంటు ముఖ్యనేత ఆధ్వర్యంలో జరుగుతున్న అవినీతి దందా బట్ట బయలు అవుతోంది. నియోజకవర్గంలో జరిగే మట్టి, ఇసుక, పేకాట, మద్యం, రేషన్ మాఫియా దందా అంతా పార్లమెంటు ముఖ్యనేత గుప్పిట్లోనే పెట్టుకోవడంతో, నియోజక వర్గ ప్రజాప్రతినిధి బహిరంగంగానే ఆ దందాపై పోరాటం చేయటం నియోజకవర్గంలో ప్రస్తుతం చర్చనీయాంఽశంగా మారుతోంది. ఇప్పటికే పలుమార్లు ఇసుక దందా, గంజాయి వంటి వాటిపైన నియోజకవర్గ ప్రజా ప్రతినిధి విమర్శలు చేశారు. నెమలి వేణుగోపాల స్వామి ఆలయంలో జరిగిన ఘటన తరువాత ఏకంగా తనపై దాడి చేసి చంపేందుకు ప్రయత్నిస్తున్నారని చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించాయి. దీంతో పాటు ఓ అడుగు ముందుకు వేసి పేకాట క్లబ్బులు మూసేసినందుకు, రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని అన్నందుకు దాడులు చేస్తారా అని ప్రశ్నించడం గమనార్హం. ఇటీవల పార్లమెంటు ముఖ్యనేత అనుచర గణం, గంపల గూడెం తహసీల్దారును తన కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకోవడం సైతం వివాదాస్పదంగా మారింది.
నియోజకవర్గ ప్రజా ప్రతినిధి బెల్ట్ షాపులపైన ఇటీవల సోషల్ మీడియాలో పోస్టు చేశారు. విచ్చలవిడిగా బెల్ట్‌షాపుల నిర్వహణ వైన్ షాపుల యాజమాన్యం సిండికేట్‌గా మారి నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎమ్మార్పీ కంటే లిక్కర్ బాటిల్‌పై రూ.20 నుంచి రూ.30 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని, గ్రామాల్లో అయితే ఏకంగా రూ.50 అదనంగా వసూలు చేస్తూ మధ్యతరగతి కుటుంబాలు వీధిన పడేలా చేస్తున్నారని ఆరోపించారు.
ఇంద్రకీలాద్రిలో భక్తుల కిటకిట
తిరువూరు పట్టణంలో జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న ఆక్రమణలతో పాటు, మున్సిపాలిటీలో ఉన్న ఆక్రమణలు తొలగించాలని ఇటీవల నియోజకవర్గ ప్రజాప్రతినిధి రోడ్డుపైన బైఠాయించారు. దీంతో అధికారులు దిగి వచ్చి వారం రోజుల్లో ఆక్రమణలు తొలగిస్తామని చెప్పటంతో ఆందోళన విరమించారు. అయితే నియోజకవర్గ ప్రజాప్రతినిధికి వ్యతిరేకంగా, పార్ల మెంటు ముఖ్యనేత వర్గం ఆందోళన చేయడంతో విభేదాలు మరింత రచ్చకెక్కాయి. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఓ నియోజకవర్గ నేత నుంచి పార్లమెంటు ముఖ్యనేత టికెట్టు ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నట్లు చర్చ సాగుతోంది. దీంతో ఆయనకు నియోజకవర్గ బాధ్యతలు అప్పజెప్పే విధంగా పావులు కదుపుతుండటంతో తిరువూరు టీడీపీలో అసంతృప్తి జ్వాలలు రావణకాష్ఠంలా రగులుతూనే ఉన్నాయి. మొత్తం మీద టీడీపీకి చెందిన నియోజకవర్గనేతలే అక్కడ జరుగుతున్న అవినీతిని బయటపెడుతుండటంతో పచ్చనేతల అవినీతి దందా బట్ట బయలై నియోజకవర్గంలో టీడీపీ ప్రజాదరణను కోల్పోతోంది.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కలెక్టరేట్ లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్) కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు.
పటమట(విజయవాడతూర్పు): విజయవాడ సౌత్ డివిజన్ ఏసీపీగా బదిలీపై వచ్చిన డాక్టర్ కె.మానస ఆదివారం సీపీ రాజశేఖర బాబును మర్యాదపూర్వరంగా కలిశారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): లోక కల్యాణార్ధం, సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఆదివారం దుర్గమ్మ సన్నిధిలో సూర్యోపాసన సేవ నిర్వహించారు.


