జ్యోతి సురేఖకు అభినందనల వెల్లువ | - | Sakshi
Sakshi News home page

జ్యోతి సురేఖకు అభినందనల వెల్లువ

Apr 13 2026 7:56 AM | Updated on Apr 13 2026 7:56 AM

జ్యోతి సురేఖకు అభినందనల వెల్లువ ఆంధ్రప్రదేశ్‌ మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ కార్యవర్గ ఎన్నిక తాడేపల్లిరూరల్‌: ఆంధ్రప్రదేశ్‌ మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (ఏపీ మా) నూతన కార్య వర్గాన్ని ఆదివారం తాడేపల్లిలోని ఏపీ మా కార్యాలయంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పిళ్లా లక్ష్మీ ప్రసాద్‌, ఉపాధ్యక్షులుగా జంధ్యాల గోపాలకృష్ణ, ఆవుల వీరశేఖరయాదవ్‌, ప్రధాన కార్యదర్శిగా జానపాటి విశ్వేశ్వరరావు, కోశాధికారిగా గుర్రం వెంకటేశ్వర్లు, కార్యదర్శులుగా రాపేటి అప్పారావు, వీరంకి వెంకట నరసింహారావు, సహాయ కార్యదర్శులుగా ముద్దన శకుంతల, కొరనాని ధనరాజ్‌, కార్య నిర్వాహక కార్యదర్శులుగా శేషా శంకరరావు, జుజ్జవరపు సరోజని, కార్యవర్గ సభ్యులుగా ఇంటూరి మల్లికార్జున చౌదరి, బొజ్జా గురవయ్య, శాంబోలు హరినాఽథ్‌, పి.ఎఫ్‌.జె. మనోరంజన్‌, చందవోలు బ్రహ్మయ్య, కొమర్రాజు రమేష్‌కుమార్‌, కర్రి వీర వెంకట రెడ్డి, షేక్‌ చాన్‌ బాషా, చుండూరు వెంకట సూర్య కుమారి, మండలి మాధవి, కర్రి ధనలక్ష్మి ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికై న వారికి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఎన్నికల అధికారిగా చుండూరి రాజేంద్రపసాద్‌ వ్యవహరించారు.

ప్రపంచకప్‌ స్టేజ్‌–1లో స్వర్ణం సాధించిన సురేఖ

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): మెక్సికోలో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచ కప్‌– స్టేజ్‌–1లో మహిళల కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో విజయవాడకు చెందిన తెలుగు అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ స్వర్ణ పతకం సాధించింది. మెక్సికోలో శనివారం జరిగిన ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌–1లో మహిళల కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో మన దేశానికి స్వర్ణం సాధించడంలో వెన్నం జ్యోతి సురేఖ కీలకపాత్ర పోషించింది. జ్యోతి సురేఖ, మధుర, ప్రగతిలతో కూడిన భారత జట్టు ఫైనల్స్‌లో 233–232 స్కోర్‌తో అమెరికాకు చెందిన క్రీడాకారులు డీన్‌ ఓలీవియా, ఫియర్స్‌ ఫేజ్‌, రూయిజ్‌ అలెక్సిస్‌పై విజయం సాధించారు. వ్యక్తిగత, టీమ్‌ ఈవెంట్స్‌లో కలిపి జ్యోతి సురేఖ 12వ స్వర్ణం సాధించడంతో నగరానికి చెందిన క్రీడాకారులు జ్యోతి సురేఖకు అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement