సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలే
భవానీపురం(విజయవాడపశ్చిమ): కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, మహిళా హక్కుల కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త, సామా జిక విప్లవకారిణి సావిత్రిబాయిపూలే అని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత కొనియాడారు. గొల్లపూడిలోని బీసీ సంక్షేమ భవన్‌లో శనివారం తొలి మహిళా ఉపాధ్యాయిని సావిత్రిబాయి పూలే జయంతి కార్య క్రమం జరిగింది. తొలుత ఆమె విగ్రహానికి మంత్రి సవిత పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సీ్త్ర విద్య కోసం కృషి చేయటమే కాకుండా బాల్య వివాహాలను వ్యతిరేకించటం, వితంతు వివాహాలను ప్రోత్సహించటం వంటి అనేక చైతన్య కార్యక్రమాలను నిర్వహించారని వివరించారు. ఈ సందర్భంగా ఆమె ఏపీ బీసీ ఉద్యోగుల ఫెడరేషన్ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యనారాయణ, డైరెక్టర్ మల్లికార్జున, అడిషనల్ డైరెక్టర్ చంద్రశేఖరరాజు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, ఫెడరేషన్ ప్రతినిధులు కె.శ్రీనివాసులు, ఎం. ప్రసాద్, చలం, వి.శ్రీనివాసులు పాల్గొన్నారు.


