బ్రో.. డ్రగ్స్ వద్దు, సైకిల్ తొక్కు
బ్రో.. డ్రగ్స్ వద్దు, సైకిల్ తొక్కు ● ఈగల్ ఐజీపీ రవికృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈగల్‌ను ఏర్పాటు చేసి డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు కృషి చేస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 869 హాట్‌స్పాట్లను గుర్తించి వాటిపై నిఘా పెంచినట్లు తెలిపారు.
● ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు మాట్లాడుతూ జిల్లాలో 43 డ్రోన్లు, పది వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నేరస్తులపై నిఘా ఉంచుతున్నట్లు తెలిపారు.
● ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ ఈగల్ విభాగం నేతృత్వంలో జిల్లాలో డ్రగ్స్ నిర్మూలన కోసం చేపడుతున్న సైకిల్ ర్యాలీ ఎంతో ప్రాముఖ్యత కలిగిందని చెప్పారు.
● డీసీపీ సరిత మాట్లాడుతూ రాష్ట్రాన్ని మాదకద్రవ్య రహితంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థలో ప్రత్యేకంగా ఈగల్ విభాగాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ఈగల్ ఎస్పీ కె.ఎం.మహేశ్వరరాజు, కె.నగేష్ బాబు, ఎన్టీఆర్ జిల్లా నార్త్ డివిజన్ ఏసీపీ స్రవంతి రాయ్, స్థానిక అధికారులు పాల్గొని మాట్లాడారు. పది కిలోమీటర్ల మేర జరిగిన ర్యాలీలో రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ క్లబ్, సైకిల్ క్లబ్, విద్యార్థులు, పార్కర్ యూత్ ఎంపవరింగ్ టీమ్, సీమస్ డీ–అడిక్షన్ సెంటర్ సభ్యులు పాల్గొన్నారు.
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన బాధ్యత ఉందని, డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంలో ప్రజలు భాగస్వాములు కావాలని డీజీపీ హరీష్‌కుమార్‌గుప్తా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ‘ఈగల్’ విభాగాధిపతి ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవికృష్ణ ఆధ్వర్యంలో ‘ఫిట్ ఇండియా – సండే ఆన్ సైకిల్ ర్యాలీ’లో భాగంగా ‘డ్రగ్స్ వద్దు బ్రో – సైకిల్ తొక్కు బ్రో’ నినాదంతో ఆదివారం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్‌సింగ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సైకిల్ ర్యాలీ జరిగింది. డీజీపీ హరీష్‌కుమార్‌గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. డ్రగ్స్ వినియోగం ఆపేందుకు సమాజం ముందుకు రావా లని కోరారు. ఎవరికై నా డ్రగ్స్ సంబంధిత సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1972కు తెలపాలన్నారు.
డీజీపీ హరీష్ కుమార్ గుప్తా