
పోలీస్ గ్రీవెన్స్‌కు 75 ఫిర్యాదులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి 75 ఫిర్యాదులు అందాయి. జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఉదయరాణి వృద్ధులు, దివ్యాంగుల వద్దకే వెళ్లి ఫిర్యాదులు అందుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. తమకు ఇచ్చిన ఫిర్యాదులపై విచారించి చర్యలు తీసుకోవాలని సంబంధిత స్టేషన్‌ల ఎస్‌హెచ్‌ఓలకు ఆదేశాలిచ్చారు. మొత్తం 75 ఫిర్యాదులు రాగా ఆస్తి, భూ వివాదాలకు సంబంధించి 46, భార్యాభర్తలు, కుటుంబ కలహాలపై 5, కొట్లాటలపై 2, వివిధ మోసాలపై 1, మహిళల సంబంధిత నేరాలపై 6, దొంగతనాలపై 1, ఇతర చిన్న నేరాలకు సంబంధించి 14 ఫిర్యాదులు అందాయి.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు పలువురు భక్తులు సోమవారం విరాళాలు అందజేశారు. విజయవాడ కరెన్సీనగర్‌కు చెందిన ఎస్.కృష్ణ, అనంతలక్ష్మి దంపతులు అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులకు రూ.లక్ష, భవానీపురం ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్డుకు చెందిన యు. లక్ష్మీపార్వతి తన భర్త వెంకటేశ్వరరావు పేరిట నిత్యాన్నదానానికి రూ. 1,00,101 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం ఇవ్వగా.. అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు.

పోలీస్ గ్రీవెన్స్‌కు 75 ఫిర్యాదులు