
సాక్షి, కృష్ణాజిల్లా: జిల్లాలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఇంటింటికి బస్సు ఆపలేదని ఆర్టీసీ బస్సుపై టీడీపీ నేతలు దాడి చేశారు. మూడు రోజుల క్రితం నిమ్మకూరు గ్రామంలో చోటుచేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయవాడ-నిమ్మకూరు మెట్రో సర్వీస్(333N) బస్సుపై దాడి చేశారు.
తాము చెప్పిన చోట ఆపలేదని బస్సు అడ్డగించిన నిమ్మకూరు గ్రామ టీడీపీ మాజీ సర్పంచ్ జంపన వెంకటేశ్వరరావు, అనగన మురళి.. బస్సు డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగారు. రిక్వెస్ట్ స్టాప్‌లోనే బస్సు ఆపుతామని డ్రైవర్ చెప్పగా.. డ్రైవర్‌ను కిందకు లాగి దాడిచేసేందుకు యత్నించారు. టీడీపీ నేతల దౌర్జన్యాన్ని కండక్టర్ వీడియో తీశారు. దీంతో కండక్టర్‌పై కూడా టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు.
