వలంటీర్‌పై టీడీపీ నాయకుల దాడి  | Sakshi
Sakshi News home page

వలంటీర్‌పై టీడీపీ నాయకుల దాడి 

Published Tue, Apr 2 2024 4:33 AM

TDP leaders attack on volunteer - Sakshi

హిందూపురం అర్బన్‌: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని 28వ వార్డు వలంటీరు సంధ్యపై సోమవారం రాత్రి టీడీపీ నాయకులు దాడిచేశారు. స్థానిక సూరççప్ప కట్టకింద (బోయపేట) ప్రాంతంలోని వలంటీర్‌ సంధ్య ఇంటివద్దకు సోమవారం రాత్రి కొందరు అవ్వాతాతలు వచ్చి పింఛన్‌ విషయమై ఆరాతీశారు.

ఈ నెల 3వ తేదీ నుంచి వార్డు సచివాలయంలో ఇస్తారని ఆమె చెబుతుండగా.. సమీపంలోనే ఉన్న టీడీపీ నాయకులు నవీన్, అనిల్, అశోక్, విజి తదితరులు ఆమెపై దాడిచేశారు. గర్భిణి అని కూడా చూడకుండా దాడిచేయడంతో ఆమెను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. టీడీపీ వర్గీయులు అక్కడికి కూడా వెళ్లి గొడవ చేశారు. తరువాత సంధ్య స్థానిక రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై విచారిస్తున్నామని సీఐ రియాజ్‌ అహమ్మద్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement