చెరువులో నీరంతా నల్లబడిపోయింది.. | - | Sakshi
Sakshi News home page

చెరువులో నీరంతా నల్లబడిపోయింది..

Aug 27 2025 9:51 AM | Updated on Aug 27 2025 9:51 AM

చెరువ

చెరువులో నీరంతా నల్లబడిపోయింది..

చెరువులో నీరంతా నల్లబడిపోయింది.. చెరువులో పోయడం దారుణం..

వేల లీటర్ల కెమికల్‌ వ్యర్థాలను మా చెరువులో వదులుతున్నారు. ఈ నెల 20వ తేదీన రాత్రి వ్యర్థాలను వదిలారు. చెరువు నీళ్లు నల్లబడిపోయి చెడు వాసన వస్తోంది. ఈ నీటిని పొలాలకు వాడాలంటే పైరు పాడైపోతుందేమోనని భయమేస్తోంది. ఈ నీటిలో పని చేయడం వల్ల మాకూ వ్యాధులు వచ్చేలా ఉన్నాయి.

– వి.లక్ష్మారెడ్డి, కురిటి చెరువు ఆయకట్టు రైతు, ఆత్కూరు గ్రామం

కెమికల్‌ వ్యర్థాలను చెరువులో పోయడం దారుణం. ఈ నీటినే వరి నాట్లు వేయడానికి వాడు తున్నాం. చెరువు నుంచి చెడు వాసన వస్తోంది. చెరువులో నీరు తాగడం వల్ల పశువులు చూడి నిలవడంలేదు. అధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు చేపట్టాలి.

– గంగుల రమేష్‌, కురిటి చెరువు ఆయకట్టు రైతు, ఆత్కూరు గ్రామం

చెరువులో నీరంతా నల్లబడిపోయింది..
1
1/1

చెరువులో నీరంతా నల్లబడిపోయింది..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement