
అత్యవసరమైతేనే బయట తినాలి
ఇటీవల కాలంలో జీర్ణాశయ, పెద్దపేగు క్యాన్సర్‌లు పెరిగాయి. అందుకు కల్తీ ఆహారం. నాన్‌వెజ్ ఎక్కువగా తీసుకోవడం కూడా కారణంగా చెప్పవచ్చు. ఆహార పదార్థాలు కల్తీ అవుతున్న నేపథ్యంలో అత్యవసరమైతేనే బయట తినాలి. మాంసాహారంలో కలిపే రసాయనిక రంగులు క్యాన్సర్‌కు దారితీస్తున్నాయి. మహిళల్లో శారీరక శ్రమ తగ్గడంతో రొమ్ము క్యాన్సర్‌తో పాటు, గర్భాశయ క్యాన్సర్ కేసులు అధికమయ్యాయి. పట్టణ వాసుల్లో ఎక్కువగా నమోదవుతున్నాయి. క్యాన్సర్‌ను ముందు జాగ్రత్తలతో నివారించగలుగుతాం.
–డాక్టర్ సుబ్బారావు, క్యాన్సర్ వైద్య నిపుణులు