
శాప్ చైర్మన్ రవినాయుడు
కానిస్టేబుళ్లుగా ఎంపికై న వారు.. రేపు హాజరుకండి
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని అన్ని జిల్లాలో పోలీస్ కానిస్టేబుళ్లుగా ఎంపికై న వారు ఈ నెల 23న గుంటూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఉదయం పది గంటలకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని గుంటూరు జిల్లా ఎస్పీ ఎస్.సతీష్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు సెలక్షన్ ప్రక్రియలో అప్లికేషన్‌తో జతపరిచిన అన్ని ధ్రువపత్రాల ఒరిజినల్స్, గజిటెడ్ అధికారితో అటెస్ట్ చేయించిన మూడు సెట్ల జిరాక్స్ కాపీలు, నాలుగు పాస్‌పోర్టు సైజ్ కలర్ ఫొటోలను తీసుకుని రావాలని సూచించారు. సివిల్ కానిస్టేబుల్స్, ఏపీ ఎస్సీ, పురుష, మహిళ అభ్యర్థులు అందరూ అదే రోజు హాజరు కావాలని స్పష్టంచేశారు.
ఉచితంగా చెస్ శిక్షణ శిబిరాలు
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): చెస్ ఆట విశేషాలను పాఠ్యాంశంగా చేర్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) చైర్మన్ రవినాయుడు చెప్పారు. స్థానిక పీబీ సిద్ధార్థ ఆడిటోరియంలో ఎస్‌ఆర్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన ఎస్‌ఆర్‌ఆర్ ఫీడే ఇంటర్నేషనల్ రేటింగ్ చెస్ టోర్నమెంట్–2025ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో శాప్ ఆధ్వర్యంలోని స్టేడియంల్లో చదరంగం కోసం ప్రత్యేకంగా ఒక గది కేటాయించి పేద విద్యార్థుల కోసం శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామన్నారు.
ఆంధ్ర చెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ మాట్లాడుతూ టోర్నమెంట్‌లో 8 చెస్ బోర్డులను లైవ్ గేమ్ కోసం అందుబాటులో ఉంచామన్నారు. 25వ తేదీ వరకు టోర్నమెంట్ జరుగుతుందన్నారు. సిద్ధార్థ అకాడమీ ఉపాధ్యక్షుడు కృష్ణరావు, జాయింట్ డైరెక్టర్ లలిత్ ప్రసాద్, ఎస్‌ఎల్‌వీ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ శ్రీనివాసరాజు, శాప్ డైరెక్టర్ సంతోష్ కుమార్, టోర్నమెంట్ డైరెక్టర్ పి.రేణుక తదితరులు పాల్గొన్నారు.