
సిద్ధార్థలో రోబో ఎక్స్ 2కె25 హాకథాన్ పోటీలు
పెనమలూరు: కానూరు సిద్ధార్థ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో జాతీయ స్థాయిలో రోబో ఎక్స్ 2కె25 హాకథాన్ పోటీలు నిర్వహిస్తున్నామని వైస్‌చాన్సలర్ డాక్టర్ పి.వెంకటేశ్వరరావు తెలిపారు. వర్సిటీలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. సెప్టెంబర్ 18, 19 తేదీల్లో జాతీయ స్థాయిలో రోబోటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ పోటీల ద్వారా విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యం పెంపొందించటమే కాకుండా యువ ఇంజినీర్ల ఆవిష్కరణలకు వేదికగా ఉంటుందన్నారు. ఈ పోటీలు ప్రధానంగా ఇండస్ట్రీస్ 4.0, స్మార్ట్స్ ఆటోమేషన్, మెకాట్రోనిక్స్, ఏఐ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్‌పై ఉంటాయన్నారు. ప్రో వైస్ చాన్స్‌లర్ డాక్టర్ ఏవీ రత్నప్రసాద్ మాట్లాడుతూ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యార్థులకు నైపుణ్యం పెంచే విధంగా చర్యలు చేపట్టామన్నారు.నూతన విద్యా విధానంలో భాగంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నామని వివరించారు. మెకానికల్ విభాగాధిపతి డాక్టర్ ఎన్.రవికుమార్ మాట్లాడుతూ ఆరు సాంకేతిక పోటీలతో కార్యక్రమం ఉంటుందన్నారు. గెలుపొందిన వారికి రూ.2 లక్షల విలువ చేసే బహుమతులు ఇస్తామన్నారు. అన్ని విభాగాలకు చెందిన విద్యార్థులు పాల్గొనవచ్చని అన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ ఎం.రవిచంద్ర, ఐటీ హెడ్ ఎం.సునీత, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్‌లు డాక్టర్ దిల్లీబాబు, డాక్టర్ ఎం.సుమలత, డాక్టర్ బి.సుప్రజరెడ్డి, విద్యార్థుల కోఆర్డినేటర్ జె.తేజఅమరేశ్వర్, ఫయాజ్, ఎం.ప్రవల్లిక, ఎస్.హర్షిత పాల్గొన్నారు.