
ఫీజులు లేకుండా అనుమతులివ్వండి
డీజీపీని కోరిన ఏపీ గణేష్ ఉత్సవ సమితి
కృష్ణలంక(విజయవాడతూర్పు): స్థానిక రాణిగారితోటలో జాతీయ రహదారి పక్కన అన్న క్యాంటీన్‌ను మంత్రి సవిత మంగళవారం సందర్శించారు. అక్కడ పరిసరాలను, పాత్రలు శుభ్రం చేసే గదిని పరిశీలించారు. లైన్‌లో నిల్చొని రూ.5ల టోకెన్ తీసుకుని భోజనం చేశారు. తనతో పాటు భోజనం చేస్తున్న వారిని అప్యాయంగా పలకరించారు. అన్న క్యాంటీన్‌ను, ఎప్పటికప్పుడు ఆహార పదార్థాల పాత్రలను, ప్లేట్లను శుభ్రం చేస్తున్న సిబ్బందిని మంత్రి అభినందించారు.
విజయవాడలీగల్: మాజీ సైనిక ఉద్యోగుల సమస్యల సత్వర పరిష్కారం నిమిత్తం వీర పరివార్ సహాయక యోజన పేరుతో లీగల్ సర్వీస్ క్లినిక్‌ను కృష్ణాజిల్లా ప్రిన్సిపల్ జడ్జి, జిల్లా న్యాయసేవా సంస్థ చైర్మన్ గుట్టల గోపీ మంగళవారం ప్రారంభించారు. నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలోని మాజీ సైనికుల కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ డిఫెన్స్‌లో పనిచేసిన మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులకు న్యాయసేవలు త్వరితగతిన అందించే ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేశామన్నారు. మండల న్యాయ సేవాధికారి, రెండో అదనపు జిల్లా జడ్జి ఏ. సత్యానంద మాట్లాడుతూ న్యాయ సహాయక క్లినిక్‌లో ప్రతి శనివారం మాజీ సైనిక ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ కేవీ రామకృష్ణయ్య అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ఏసీబీ కోర్టు జడ్జి పి. భాస్కరరావు, బెజవాడ బార్ అధ్యక్షుడు ఏకే బాషా తదితరులు పాల్గొన్నారు.
నాగాయలంక: స్థానిక శ్రీరామ పాదక్షేత్రం ఘాట్‌లోని శ్రీగంగ పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి మండపంలోని స్వామివారి శివలింగానికి మంగళవారం ప్రదోషకాలంలో 108 కేజీల పసుపు కొమ్ములతో మహాభిషేకం జరిపారు. శ్రావణమాసం బహుళ ఏకాదశి, ఆఖరి మంగళవారం విశిష్టతను పురస్కరించుకొని భక్తులు, దాతలు సమర్పించే పసుపు కొమ్ములతో ఈ అభిషేకం, అర్చన జరిపారు.

ఫీజులు లేకుండా అనుమతులివ్వండి

ఫీజులు లేకుండా అనుమతులివ్వండి