
కొనసాగుతున్న ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రకాశం బ్యారేజ్ వద్ద ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కృష్ణానది పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలు, ఎగువ ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద కారణంగా ప్రకాశం బ్యారేజ్‌కి భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. మంగళవారం రాత్రి 10 గంటలకు బ్యారేజ్‌కు 4,92,357 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తోంది. ఇందులో 4,87,194 క్యూసెక్కులు సముద్రంలోకి వదిలివేస్తున్నారు. ఈస్ట్, వెస్ట్ కాలువలకు 4,849 క్యూసెక్కులు విడుదల చేశారు. బ్యారేజ్‌కు మరింత వరద వచ్చే అవకాశం ఉందని, పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
ఎన్టీఆర్ జిల్లాలో 14.46 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం..
ఎన్టీఆర్ జిల్లాలోని 20 మండలాల్లో 14.46 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. గంపలగూడెంలో 42.8మిల్లీమీటర్లు, ఏ కొండూరులో 33.4, విస్సన్నపేటలో 32.6, తిరువూరులో 28.8, వత్సవాయిలో 22.2, రెడ్డిగూడెంలో 18.2, వీరులపాడులో 16.8, పెనుగంచిప్రోలులో 12.8, జి కొండూరులో 12.8, జగ్గయ్యపేటలో 11.8, ఇబ్రహీంపట్నంలో 10.6, కంచికచర్లలో 7.0, విజయవాడ రూరల్‌లో 6.0, ఈస్ట్‌లో 5.8, సెంట్రల్‌లో 5.4, వెస్ట్‌లో 5.4, నందిగామలో 3.6, చందర్లపాడులో 2.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.