
క్షమాపణ చెప్పే వరకు ఆందోళన ఆగదు
మచిలీపట్నంటౌన్: సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకుంటే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హెచ్చరించారు. నగరంలోని బస్టాండ్ సెంటర్లో ఉన్న మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహం వద్ద జూనియర్ ఎన్టీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలు వేసి గుమ్మడికాయతో దిష్టి తీసి టెంకాయలు కొట్టారు. ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ చిత్రపటాన్ని చెప్పులతో కొట్టి దహనం చేశారు.
ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ చిత్రపటాన్ని చెప్పుతో కొడుతున్న జూ.ఎన్టీఆర్ అభిమానులు