రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ఖరగ్‌పూర్ డివిజన్‌లోని షాలీమార్ స్టేషన్‌లో జరుగుతున్న స్టేషన్ ఆధునికీకరణ పనుల కారణంగా విజయవాడ మీదుగా ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను పూర్తిగాను, మరికొన్నింటిని పాక్షికంగానూ రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.
రద్దు చేసిన రైళ్లు ఇవే..
చర్లపల్లి–షాలీమార్ (18046) నవంబర్ 19, 21, షాలీమార్–చర్లపల్లి (18045) నవంబర్ 20, 21, షాలీమార్–సికింద్రాబాద్ (22849) నవంబర్ 12, 19, సికింద్రాబాద్–షాలీమార్ (22850) నవంబర్ 14, 21, తిరువనంతపురం–షాలీమార్ (22641) నవంబర్ 13, 15, షాలీమార్–తిరువనంతపురం (22642) నవంబర్ 16, 18, షాలీమార్–వాస్కోడిగామా (18047) నవంబర్ 17, వాస్కోడిగామా–షాలీమార్ (18048) నవంబర్ 20, షాలీమార్–చైన్నె సెంట్రల్ (02841) నవంబర్ 10, 17, చైన్నె సెంట్రల్–షాలీమార్ (02842) నవంబర్ 12, 19, నాగర్‌కోయల్–షాలీమార్ (12659) నవంబర్ 16, షాలీమార్–నాగర్‌కోయల్ (12660) నవంబర్ 19 తేదీల్లో పూర్తిగా రద్దు చేసినట్లు తెలిపారు.
పాక్షికంగా రద్దు చేసిన రైళ్లు..
చైన్నె సెంట్రల్–షాలీమార్ (22826) అక్టోబర్ 29, నవంబర్ 12, 19 తేదీల్లోనూ, వాస్కోడిగామా–షాలీమార్ (180480) అక్టోబర్ 31, నవంబర్ 13, 16, 18 తేదీల్లో సంత్రగచ్చి–షాలీమార్‌ల మధ్య పాక్షికంగా రద్దు చేశారు. అదే విధంగా షాలీమార్–చైన్నె సెంట్రల్ (12841) నవంబర్ 13 నుంచి 24 వరకు హౌరా–సంత్రగచ్చిల మధ్య పాక్షికంగా రద్దు చేశారు.