
ఉద్యోగ భద్రతపై భయాందోళన
ఏపీటీడీసీ యూనిట్లను ప్రైవేటీకరణ చేస్తే వచ్చే సంస్థలు కొన్ని దశాబ్దాలుగా పని చేస్తున్న తమను విధుల్లో కొనసాగనిస్తాయా అని కాంటాక్ట్/మ్యాన్‌పవర్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు వారు ఇటీవల విజయవాడలోని ఏపీటీడీసీ ప్రధాన కార్యాలయంలో ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. పర్యాటక శాఖకు లీజుల పేరుతో ఇప్పటికే బకాయిలు ఉన్న సుమారు రూ.63 కోట్లను వసూలు చేయలేని ప్రభుత్వం కొత్తగా ఇచ్చే లీజు సొమ్మును క్రమం తప్పకుండా వసూలు చేయగలదా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించటం గమనార్హం.