
మహనీయుల త్యాగాల ఫలితమే స్వాతంత్య్రం
చిలకలపూడి(మచిలీపట్నం): ఎంతో మంది మహనీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపి అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో శుక్రవారం స్వాతంత్య్ర దిన వేడుకల్లో భాగంగా ఆయన జాతీయజెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన దేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని, దేశంలో విభిన్న వర్గాల ప్రజలు ఉన్నారని అందరూ ఐకమత్యంతో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కేవీ రామకృష్ణయ్య , పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో...
కలెక్టరేట్‌లో స్వాతంత్ర దిన వేడుకల సందర్భంగా జాతీయజెండాను ఇన్‌చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ ఎగురవేశారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. గీతాంజలిశర్మ మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం ఎందరో మహానుభావులు వారి జీవితాలను త్యాగం చేశారని, వారిని స్మరించుకుంటూ మనందరం ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, డీఆర్వో చంద్రశేఖరరావు, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, కలెక్టరేట్ ఏవో రాధిక, సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపి

మహనీయుల త్యాగాల ఫలితమే స్వాతంత్య్రం