డీఎల్‌ఓ తీరుపై విచారణ | - | Sakshi
Sakshi News home page

డీఎల్‌ఓ తీరుపై విచారణ

Aug 15 2025 6:34 AM | Updated on Aug 15 2025 6:34 AM

డీఎల్

డీఎల్‌ఓ తీరుపై విచారణ

డీఎల్‌ఓ తీరుపై విచారణ దుర్గమ్మకు పలువురి విరాళాలు రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

లబ్బీపేట(విజయవాడతూర్పు): హెచ్‌ఐవీ బాధితులను ఉద్దేశించి అమానవీయంగా మాట్లాడిన జిల్లా లెప్రసీ, టీబీ అధికారి తీరుపై వైద్యశాఖ కమిషనర్‌ వీరపాండియన్‌ సీరియస్‌ అయినట్లు తెలిసింది. హెచ్‌ఐవీ బాధితుల సేవల విషయంలో ఓ వైద్యుడితో ఫోన్లో సంభాషించిన విషయమై సాక్షి జిల్లా ఎడిషన్‌లో ఈ నెల 12న పోతే పొమ్మనండి అంటూ కథనం ప్రచురితమైంది. దీనిపై కమిషనర్‌ విచారణకు ఆదేశించారు. దీంతో ఆయన ఫోన్‌లో మాట్లాడిన వైద్యుడి నుంచి డీఎంహెచ్‌ఓ వివరణ తీసుకున్నారు. డీఎంఓ, వైద్యశాఖ కార్యాలయంలో వైద్యుల పట్ల ప్రవర్తనా తీరుపై వారి వద్ద నుంచి కూడా వివరణ తీసుకున్నట్లు తెలిసింది. విచారణ నివేదికను డీఎంహెచ్‌ఓ వైద్యశాఖ కమిషనర్‌కు పంపించారని సమాచారం. ఈ విషయమై ఏపీ శాక్స్‌ అధికారులు సైతం సీరియస్‌గా ఉన్నట్లు తెలిసింది. ఇలాంటి అధికారులతో హెచ్‌ఐవీ బాఽధితుల మనోభావాలు దెబ్బతింటాయని భావిస్తున్నట్లు సమాచారం.

టీబీలోనూ అంతే..

నెలన్నర కిందట బాధ్యతలు చేపట్టిన ఆ అధికారి వచ్చిన వెంటనే కొందరు సిబ్బందిని ఇష్టారాజ్యంగా బదిలీలు చేసేసినట్లు తెలిసింది. వాస్తవంగా వారికి పోస్టింగు ఇచ్చిన సమయంలో ఏ సెంటర్‌లో పనిచేయాలో కూడా పేర్కొంటారు. కానీ దానికి విరుద్ధంగా బదిలీలు చేసినట్లు చెబుతున్నారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు గురువారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. అమ్మవారి సన్నిధిలో నిత్యాన్నదానానికి కంకిపాడుకు చెందిన బి.తుషార పేరిట రాజేష్‌ దంపతులు రూ.1,01,116 విరాళాన్ని అందజేశారు. ఉచిత ప్రసాద వితరణ పథకానికి విజయవాడ కామకోటి నగర్‌కు చెందిన సీహెచ్‌ రమేష్‌కుమార్‌, మాధురి దంపతులు తమ కుమారులు చుండూరి నాగరామ్‌, జశ్వంత్‌ పేరిట రూ.1,00,116 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. అమ్మవారి చిత్ర పటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.

కృత్తివెన్ను: రపమాదవశాత్తు బైక్‌ రోడ్డు మార్జిన్‌లో పడిపోవడంతో వ్యక్తి మరణించిన సంఘటన మండల పరిధిలోని సంగమూడి సమీపంలో బుధవారం రాత్రి జరిగింది. కృత్తివెన్ను ఎస్‌ఐ పైడిబాబు తెలిపిన వివరాల ప్రకారం చినగట్టు గ్రామానికి చెందిన మాటూరి బసవేశ్వరరావు (పెదబాబు) బుధవారం రాత్రి కృత్తివెన్ను వెళుతుండగా అతను ప్రయాణిస్తున్న మోటార్‌బైక్‌ అదుపుతప్పి రోడ్డు మార్జిన్‌లోకి దూసుకుపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ గమనించలేదు. కొంత సమయం తరువాత వాహనదారుల సమాచారం మేరకు ప్రమాద స్థలాన్ని గుర్తించి చూడగా అప్పటికే పెదబాబు మరణించాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం గురువారం బంధువులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

డీఎల్‌ఓ తీరుపై విచారణ 1
1/1

డీఎల్‌ఓ తీరుపై విచారణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement