విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

Aug 9 2025 8:50 AM | Updated on Aug 9 2025 8:52 AM

ఎన్టీఆర్‌ జిల్లా
శనివారం శ్రీ 9 శ్రీ ఆగస్టు శ్రీ 2025

సాగర్‌ నీటిమట్టం

విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం శుక్రవారం 589.10 అడుగులకు చేరింది. ఇది 312.0450 టీఎంసీలకు సమానం.

పొంగిన వాగులు

పెనుగంచిప్రోలు మండలంలో గురువారం కురిసిన భారీ వర్షంతో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.

15న సామూహిక వరలక్ష్మీ వ్రతం

పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మ వారి ఆలయంలో ఆగస్టు 15న సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో బీహెచ్‌వీఎస్‌ఎన్‌ కిషోర్‌ కుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

–8లోu

ఉచిత ప్రసాద వితరణకు రూ.లక్ష విరాళం

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరిగే ఉచిత ప్రసాద వితరణ పథకానికి విజయవాడకు చెందిన భక్తులు శుక్రవారం రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. విజయవాడ బెంజ్‌సర్కిల్‌కు చెందిన పరిమి కోటేశ్వరరావు తన భార్య సుజాత, కుమార్తె, అల్లుడు సాయి సింధూర, భాస్కర్‌, మనవరాలు అమీరా పేరిట ఉచిత ప్రసాదానికి రూ.లక్ష ఒక్క రూపాయిని విరాళంగా ఆలయ అధికారులకు అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.

బస్సులు కండిషన్‌లో

ఉండేలా సిద్ధం చేయాలి

గన్నవరం: స్థానిక ఆర్టీసీ డిపోను శుక్రవారం జిల్లా ప్రజా రవాణా అధికారి(డీపీటీఓ) సందర్శించారు. గ్యారేజ్‌లోని బస్సులను తనిఖీ చేసిన ఆయన వాహనాల కండిషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందితో ఆయన మాట్లాడుతూ...ఈ నెల 15వ తేదీ నుంచి సీ్త్రశక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం ప్రారంభిస్తున్న దృష్ట్యా బస్సులను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని సూచించారు. బస్సులను మరమ్మతులు చేసిన తర్వాత రోడ్డుపై టెస్ట్‌ డ్రైవ్‌ కూడా చేయాలని తెలిపారు. ప్రయాణికుల రద్దీకి తగ్గట్లుగా బస్‌స్టేషన్‌లో సదుపాయాలను కూడా మెరుగుపరచాలన్నారు. ప్రయాణికులు కూర్చునేందుకు వీలుగా బల్లలు, కుర్చీలు, లైటింగ్‌, మంచినీటి సదుపాయం, టాయిలెట్స్‌ అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సిబ్బందికి తెలిపారు. బస్సులు క్యాన్సిలేషన్‌ లేకుండా చూడాలని, అవసరమైతే అదనపు ట్రిప్పులు నడపాలని ఆదేశించారు. అనంతరం టాయిలెట్స్‌ పరిశుభ్రతను, డోర్‌ హ్యాంగర్‌లను ఆయన పరిశీలించారు. డిపో మేనేజర్‌ పి. శివాజీ, సూపర్‌వైజర్లు వెంకటేశ్వరరావు, మధు తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన భూ వరాహస్వామి జయంతి వేడుకలు

తాడేపల్లిరూరల్‌: గుంటూరు జిల్లా సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై మూడు రోజులు నిర్వహిస్తున్న భూ వరాహస్వామి జయంతి వేడుకలు శుక్రవారంతో ఘనంగా ముగిశాయి. శ్రావణ శుక్రవారం సందర్భంగా జీయర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు శకుంతల దంపతులు పద్మావతి అమ్మవారికి వివిధ రకాల స్వీట్లు, వస్త్రాలు, పండ్లతో సారెను అందజేశారు.

ఎన్టీఆర్‌ జిల్లాలో తొలగించిన పెన్షన్లు...

పాలకుడికి మంచి మనసు ఉంటేనే పాలితులకు న్యాయం జరుగుతుంది. కర్కశ హృదయులు కీలక స్థానంలో ఉంటే

ఆ రాజ్యంలో సామాన్యుడి వేదన ఆలకించేదెవరు... ఎన్నికల్లో గెలుపుకోసం అలవికాని హామీలిచ్చి గద్దెనెక్కిన ప్రభువులు హామీలను తుంగలో తొక్కుతున్నారు. పేరుకు అమలుచేశాం అని చెప్పుకోవడానికి రకరకాల సాకులు చూపి లబ్ధిదారుల్లో భారీగా కోత పెడుతున్నారు. ఆఖరుకు దివ్యాంగులను కూడా పునఃపరిశీలనతో పేరుతో ఆస్పత్రుల చుట్టూ తిప్పి నానా ఇబ్బందులు పెట్టారు. ఏవో సాకులతో వేలాది మంది దివ్యాంగులకు పెన్షన్లు నిలిపివేయడంతో వారు ఉసూరుమంటున్నారు. తమ ఉసురు తగలక మానదని ప్రభుత్వానికి శాపనార్ధాలు పెడుతున్నారు.

జగ్గయ్యపేట అర్బన్‌: ఎన్నికలకు ముందు అమలుకు సాధ్యం కాని పథకాలను అమలు చేస్తామని చెప్పి ఓటర్లను ఆకర్షించి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తీరా ఏడాదిలోనే ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ఆపసోపాలు పడుతోంది. ఏ పథకం ఖర్చు తగ్గించుకుందామా అని చూస్తూ రకరకాల నిబంధనల పేరుతో లబ్ధిదారులకు కోత విధిస్తోంది. సామాజిక పింఛన్లలో కోత విధించి అనేక మందిని తొలగించింది. ఇప్పుడు దివ్యాంగుల వంతు వచ్చింది. గతంలో సదరం క్యాంపులో పరీక్షలు చేసి సర్టిఫికెట్లు ఇచ్చిన వారిని సైతం పునఃపరిశీలన, పరీక్షల పేరుతో పెద్ద ఎత్తున తొలగించారు.

షెడ్యూల్‌ ప్రకారం జరగని రీ వెరిఫికేషన్‌...

గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా సదరం క్యాంపు పెట్టి అర్హత లేని వారికి కూడా దివ్యాంగుల సర్టిఫికెట్‌ ఇచ్చారనే వంకతో పెన్షన్లకు కోత పెట్టాలని భావించిన కూటమి ప్రభుత్వం ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు పీహెచ్‌సీలలో రీవెరిఫికేషన్‌ శిబిరాలను ఏర్పాటుచేసింది. వారంలో గురు, శుక్ర, శనివారం 3 రోజుల చొప్పున వీటిని నిర్వహించారు. కానీ వారు ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం జరగలేదు. ఆయా షెడ్యూల్‌ ప్రకారం రీవెరిఫికేషన్‌ జరుగుతుందని ప్రయాసపడి గ్రామాల నుంచి కుటుంబ సభ్యులను వెంటబెట్టుకొని ప్రభుత్వాస్పత్రులకు వచ్చిన దివ్యాంగులు తీరా వాయిదా పడటంతో మరలా ఇళ్లకు వెళ్లిపోతూ ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రీ వెరిఫికేషన్‌ చేస్తారని అన్న పానీయాలు లేకుండా ఎదురు చూస్తూ ఇబ్బందులు పడిన దివ్యాంగులకు అనేక పర్యాయాలు వైఎస్సార్‌ సీపీ నాయకులు, ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తాగునీరు, అల్పాహారాలు, భోజనాలు ఏర్పాటుచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

తాత్కాలికంగానే నిలిపాం

సర్టిఫికెట్ల రీ అసెస్‌మెంట్‌ నోటీసులు తీసుకోని వారు, హాజరుకాని వారికి మాత్రమే పెన్షన్లు నిలిపివేశాం. 27 వేలు మన జిల్లాలో పెన్షన్లు ఉంటే వాటిలో 15 వేలు రీ ఎసెస్‌మెంట్‌ అయ్యాయి. ఇంకా 10 వేలు రీఎసెస్‌మెంట్‌ చేయాల్సి ఉంది. వారికి కూడా దఫాలవారీగా చేస్తాం. ప్రస్తుతం 6 వేల మందికి షెడ్యూల్‌ ఇచ్చాం. ఒక్క లోకోమోటర్‌(ఆర్థో) వరకే నిర్ణయించిన 5 వైద్య శాలల్లో చూస్తారు. మల్టీబుల్‌ డిజేబుల్స్‌ అన్నీ విజయవాడ జీజీహెచ్‌కు రావాల్సిందే.

–నాంచారరావు, పీడీ, డీఆర్‌డీఏ,

ఎన్టీఆర్‌ జిల్లా

సాక్షిటాస్క్‌ఫోర్స్‌, విజయవాడ: నివాస ప్రాంతాల మధ్యే ఉండే అపార్ట్‌మెంట్లలో పేకాట శిబిరాల నిర్వహణ, అందమైన అమ్మాయిలకు వల వేసి లొంగదీసుకోవడం... దారిలోకి రాకుంటే బెదిరింపులకు పాల్పడటం, తరచూ ముఖ్యనేతలు, తమకు సహకరించే అధికారులకు ఖరీదైన పార్టీలు (మందు, విందు, పొందులతో) ఇదీ... తూర్పు నియోజకవర్గంలో ఓ ముఠా యధేచ్ఛగా కొనసాగిస్తున్న నిర్వాకం. ఈ విషయం అందరికీ తెలిసినా ఎవరూ వారి జోలికి వెళ్లేందుకు సాహసించరు. వారి బారిన పడి బలైన వారు కూడా బయటకు చెప్పేందుకు భయపడతారు. అందుకు కారణం తూర్పు నియోజకవర్గంలో అధికార పార్టీ కీలకనేత, ఆయన తనయుడి అండదండలు వారికి ఉండటమే. వీరి అరాచక ‘జ్వాల’లు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వారి అనుచరులు ముఠాలుగా ఏర్పడి 2014–19 మధ్యలో కాల్‌మనీ, సెక్స్‌ రాకెట్‌ను యధేచ్ఛగా కొనసాగించారు. ఇప్పుడు మళ్లీ అసాంఘిక చర్యలతో రెచ్చిపోతున్నారు. వారి పేరు చెబి తేనే యువత భయభ్రాంతులకు గురవుతున్నారు.

వీరి బారిన పడిన ఎందరో...

ఒకప్పుడు కాల్‌మనీ పేరుతో వడ్డీలకు ఇచ్చి, అధిక వడ్డీలు చెల్లించలేని వారితో తమ అవసరాలు తీర్చుకున్న ఈ ముఠా సభ్యుల బారిన పడి ఎంతోమంది బలైనట్లు చెబుతున్నారు. అంతేకాదు ఎక్కడైనా అందమైన అమ్మాయి కనపడితే చాలు ఆమెను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తుంటారని, లొంగక పోతే బెదిరింపులకు పాల్పడుతుంటారని అంటున్నారు. వీళ్ల బ్లాక్‌ మెయిలింగ్‌ తట్టుకోలేక అనేక మంది లొంగిపోతుంటారంటున్నారు. వీరి వ్యవహారం తూర్పు నియోజకవర్గం అంతా తెలిసినప్పటికీ, బయటకు చెప్పేందుకు సాహసించడం లేదంటే, ఏ స్థాయిలో బెదిరింపులకు పాల్పడుతుంటారో అర్ధం చేసుకోవచ్చు. పోలీసులు నిఘా పెట్టి మరింతమంది అబలలు బలికాకుండా చూడాలని తూర్పు నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.

ఆకాశాన్నంటిన

అగ్నికీలలు!

7

న్యూస్‌రీల్‌

పెన్షన్‌ల నిలిపివేతతో ఉసూరుమంటున్న దివ్యాంగులు జిల్లాలో 10,205 పెన్షన్ల నిలిపివేత పునఃపరిశీలన పేరుతో కోత విఽధింపు నిబంధనల పేరుతో ఉన్న పెన్షన్లకు ఎసరు

2 లక్షల దివ్యాంగుల పెన్షన్లకు కోత విధించేందుకే ఈ రీవెరిఫికేషన్‌ ప్రక్రియ

గత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో దివ్యాంగుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించారు. కూటమి ప్రభుత్వం పూర్తిగా వైకల్యం ఉన్న వారిని కూడా రీ వెరిఫికేషన్‌ పేరుతో ప్రభుత్వాస్పత్రులకు పిలిిపించి వారి పట్ల అమానుషంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో 8 లక్షల మంది దివ్యాంగ పెన్షన్‌దారులు ఉండగా, వారిలో 2 లక్షల పెన్షన్లను తొలగించడమే లక్ష్యంగా రీ వెరిఫికేషన్‌ క్యాంపులను నిర్వహించింది. జూలై నెల పెన్షన్లు చాలా మందికి రాలేదు. వారు నెలవారీ అవసరాలు తీర్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క ఎన్టీఆర్‌ జిల్లాలోనే సుమారు 10 వేల మందికి పైగా పెన్షన్లు నిలిపివేశారు.

–పూర్ణకంటి బాబురావు,

జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు

మదర్‌ థెరిస్సా విగ్రహం సమీపంలోని ఓ అపార్ట్‌ మెంట్‌లో వీరి అక్రమ కార్యకలాపాలన్నీ సాగిస్తున్నట్లు చెబుతున్నారు. నివాస ప్రాంతాల మధ్యనే పేకాట, మందు పార్టీలతో పాటు, ఇతరత్రా వ్యవహారాలు అన్నీ అక్కడే జరుగుతుంటాయని తెలుస్తోంది. తూర్పు కీలకనేతకు అనుచరుడితో పాటు, నగరంలోని మాజీ ఎమ్మెల్యేకు అనుచరుడుగా చెప్పుకునే మరొకరు ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు చెబుతున్నారు. వీరు ఏర్పాటు చేసే పార్టీలకు అవసరమైన విదేశీ మద్యాన్ని నగరంలోని ఓ మహిళ సరఫరా చేస్తుందంటున్నారు. ఆమె వద్ద ఎకై ్సజ్‌ పోలీసులు ఇటీవల పెద్ద మొత్తంలో విదేశీ మద్యం బాటిళ్లు కూడా పట్టుకున్నట్లు సమా చారం. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారంపై పోలీసులు తీగలాగితే డొంక కదిలే అవకాశం ఉందని తూర్పు నియోజక వర్గానికి చెందిన పలువురు అంటున్నారు.

విజయవాడ సిటీ1
1/12

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ2
2/12

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ3
3/12

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ4
4/12

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ5
5/12

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ6
6/12

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ7
7/12

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ8
8/12

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ9
9/12

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ10
10/12

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ11
11/12

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ12
12/12

విజయవాడ సిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement