
యాసిడ్ లోడుతో వెళ్తున్న ట్రక్కు ఆటో బోల్తా
హనుమాన్‌జంక్షన్ రూరల్: చైన్నె–కోల్‌కతా జాతీయ రహదారిపై హనుమాన్‌జంక్షన్ బైపాస్‌రోడ్డులో యాసిస్ లోడుతో వెళ్తున్న ట్రక్ ఆటో బోల్తా కొట్టిన ఘటనలో ఓ మహిళ దుర్మరణం చెందింది. వివరాల్లోకి వెళ్లితే.. గుంటూరుకు చెందిన ఆటోడ్రైవర్ షేక్ అల్లాభక్షు శుక్రవారం యాసిడ్ లోడుతో ఏలూరుకు కిరాయి కోసం బయలుదేరాడు. అతనితో పాటుగా తోడు ఉంటుందని తన భార్య షేక్ షంషాద్ (47)కు కూడా వెంట తీసుకెళ్లాడు. భార్యభర్తలిద్దరూ ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా మార్గమధ్యంలో దుర్ఘటన చోటు చేసుకుంది.
అదుపుతప్పి బోల్తా
హనుమాన్‌జంక్షన్ బైపాస్‌రోడ్డు వద్దకు రాగానే ట్రక్కు ఆటో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ఆటో డ్రైవర్ క్యాబిన్‌లో ఉన్న భార్య షంషాద్ రోడ్డుపైకి పడిపోయింది. ఆటో బోల్తా కొట్టడంతో ట్రక్కులో ఉన్న యాసిడ్ డ్రమ్ములు కూడా కిందకు ఒరిగిపోయాయి. దీంతో షంషాద్‌పై అధిక మొత్తంతో యాసిడ్ పడటంతో ఆమె శరీరంగా తీవ్రంగా కాలిపోయి, అక్కడికక్కడే మృత్యువాత పడింది. ఆటో నడుపుతున్న ఆమె భర్త షేక్ అలాభక్షు కంటిలో యాసిడ్ పడటంతో పాటుగా శరీరంపై పలుచోట్ల గాయాలైయ్యాయి. రహదారిపై యాసిడ్ పడి ప్రమాదకరంగా మారడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న హనుమాన్‌జంక్షన్ ఫైర్ ఆఫీసర్ వి.అమరేశ్వరరావు సిబ్బందితో రహదారిపై పడిన యాసిడ్‌ను శుభ్రం చేయించారు. క్రేన్ సాయంతో ట్రక్కు ఆటోను రహదారిపై నుంచి పక్కకు తొలగించారు. ఘటనపై పెదపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తొలుత ఆటోడ్రైవర్ షేక్ అల్లాభక్షును చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అక్కడి వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. మృతురాలు షేక్ షంషాద్‌కు ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.
వాచ్‌మెన్ అనుమానాస్పద మృతి
మధురానగర్(విజయవాడసెంట్రల్): వాచ్‌మెన్ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన గుణదల పీఎస్ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుణదల అయ్యప్పనగర్‌కు చెందిన బద్దూరి ప్రసాద్(45) అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. గురువారం ఉదయం 5 గంటలకు ప్రసాద్ ఇంటినుంచి బయటకు వెళ్లిపోయారు. మధ్యాహ్నం ఏలూరు రోడ్డులో కొబ్బరికాయలు అమ్ముకునే వ్యక్తి ప్రసాద్ కుమార్తె నీలవేణికి ఫోన్ చేసి మధురానగర్ శివాలయం రైవస్‌కాలువ పక్కన మీ నాన్న ఫిట్స్‌వచ్చి చనిపోయారని తెలిపారు. దీంతో నీలవేణి తల్లి గౌరికి ఫోన్‌చేసి సమాచారం తెలియజేశారు. సమాచారం అందుకున్న గౌరి ఘటనాస్థలికి చేరుకుని చూడగా అప్పటికే ప్రసాద్ మృతి చెంది ఉన్నారు. దీంతో గౌరి ఫిర్యాదు మేరకు గుణదల పోలీసులు కేసు నమోదు చేసి మృత దేహాన్ని పోస్టుమార్టమ్‌కు పంపించారు. ప్రసాద్‌కు అప్పుడప్పుడు ఫిట్స్ వస్తుంటాయని వాటితో చనిపోయి ఉండవచ్చని ఫిర్యాదులో పేర్కొన్నారు.
డ్రైవర్ భార్య దుర్మరణం