
విశాఖపట్నం :నగరంలోని డా.వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ మైదానంలో ఏపీఎల్ 4వ సీజన్ అట్టహాసంగా శుక్రవారం ప్రారంభమైంది.

భారత మహిళా జట్టు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్, సీజన్ బ్రాండ్ అంబాసిడర్ విక్టరీ వెంకటేష్ ట్రోఫీని ఆవిష్కరించగా, సినీ నటి ప్రజ్ఞాజైస్వాల్ షో ఉర్రూతలూగించింది.

తొలి మ్యాచ్‌లో టాస్ ఓడి కాకినాడ కింగ్స్ బ్యాటింగ్‌కు దిగి ఐదు వికెట్లకు 229 పరుగులు సాధించింది.

వర్షం కారణంగా అమరావతి రాయల్స్‌కు 14 ఓవర్లకు 173 లక్ష్యంగా నిర్ధారించారు. రాయల్స్ జట్టు 13.2 ఓవర్లలోనే 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.













