
కంచికచర్ల : మండల కేంద్రంలోని ఓ బంగారం దుకాణంలో సోమవారం తెల్లవారుజామున చోరీ జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. నందిగామ సబ్ డివిజన్ ఏసీపీ రవికిరణ్ కథనం మేరకు...కంచికచర్లలో జూలూరు శేషుకుమార్‌కు చెందిన శ్రీ వాసవి జ్యూయలర్స్ దుకాణంలో గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగులకొట్టి 350 గ్రాముల బంగారు నగలు, 8 కిలోల వెండి చోరీ చేశారని చెప్పారు. వాటి విలువ సుమారు రూ.14.50 లక్షలు ఉంటుందని వెల్లడించారు. షాపునకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కూడా తీసుకెళ్లారని తెలిపారు. మచిలీపట్నం నుంచి డాగ్ స్క్వాడ్, వేలిముద్రల నిపుణలను పిలిపించి విచారణ చేపట్టామని పేర్కొన్నారు. త్వరలోనే దుండగులను పట్టుకుంటామని తెలిపారు. పోయిన నగలు రికవరీ చేస్తామన్నారు. కార్యక్రమంలో క్రైం ఏసీపీ శ్రవంతిరాయ్, నందిగామ రూరల్ సర్కిల్ సీఐ పి.చంద్రశేఖర్, ఎస్‌ఐ పెంకె వెంకట సత్య సుబ్రహ్మణ్యం, ఎస్‌ఐ–2 హేమలత, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.