యోగాతో అద్భుత ప్రయోజనాలు
మచిలీపట్నంటౌన్: యోగ సాధనతో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయని, నిత్య యోగ సాధనతో శారీరక ఆరోగ్యంతో పాటు, మానసిక ఒత్తిడి తగ్గుతుందని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. ఇటీవల రాష్ట్ర స్థాయిలో ఫైళ్ల పరిష్కారంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి సీఎం చంద్రబాబునాయుడు నుంచి ప్రశంసలు పొందిన కలెక్టర్ డీకే బాలాజీని యోగా గురువులు, సభ్యులు ఘనంగా సోమవారం సన్మానించారు. గాంధీనగర్‌లోని వాకర్స్ అసోసియేషన్ హాల్‌లో యోగా తరగతులు నిర్వహించిన అనంతరం కలెక్టర్‌ను శాలువాలు, పూలదండలు, పుష్పగుచ్చాలు, మొక్కలతో ఘనంగా సన్మానించారు. బాలాజీని యోగా గురువులు గురునాథబాబు, మహాలక్ష్మి, చింతయ్య, వడ్డి శ్రీనివాస్, వాకర్స్ అసోసియేషన్ ట్రస్టీ యారా జగన్ మోహన్, మచిలీపట్నం జ్యూవెలరీ పార్క్ అసోసియేషన్ అధ్యక్షులు అంకెం జితేంద్ర, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు సన్మానించారు.


