ఆశయం ఆవిరి | - | Sakshi
Sakshi News home page

ఆశయం ఆవిరి

Dec 23 2025 6:48 AM | Updated on Dec 23 2025 6:48 AM

ఆశయం

ఆశయం ఆవిరి

పాడైపోతున్నాయని..

గత ప్రభుత్వం మహోన్నత లక్ష్యంతో సమకూర్చిన వైనం 8 స్కానింగ్‌ మిషన్లు సమకూర్చగా, 7 ఇతర జిల్లాలకు తరలింపు పేదల ఆరోగ్యాన్ని విస్మరిస్తున్న సర్కార్‌ ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్న గర్భిణులు అన్ని ప్రాంతాల వారు జీజీహెచ్‌కు వెళ్లాల్సిందే శాంపిల్‌ కలెక్షన్‌ సెంటర్లుగా మారుతున్న ల్యాబ్‌లు

పట్టణ ఆరోగ్యకేంద్రాల్లోని స్కానింగ్‌ మెషిన్లు తరలించేశారు

గర్భిణుల

ఇబ్బందులు

లబ్బీపేట(విజయవాడతూర్పు): పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే మహోన్న ఆశయంతో గత వైఎస్సార్‌ ప్రభుత్వం ప్రభుత్వాస్పత్రులు, పట్టణ ఆరోగ్యకేంద్రాల్లో అధునాతన మెషినరీ, ల్యాబ్‌లు ఏర్పాటుచేస్తే.. ప్రస్తుత చంద్రబాబు సర్కార్‌ ఆ లక్ష్యాన్ని నీరుగారుస్తోంది. గతంలో ప్రజల ఇళ్ల ముంగిటకే వైఎస్సార్‌ సీపీ మెరుగైన వైద్యసేవలను అందజేసింది. అయితే నాణ్యమైన వైద్యసేవలు అందించాల్సిన పాలకులు ప్రస్తుతం ఆ బాధ్యత నుంచి తప్పుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల్లోని గర్భిణులకు స్కానింగ్‌ సౌకర్యం అందుబాటులో ఉంచడానికి గత ప్రభుత్వం పరికరాలను ఏర్పాటు చేసింది. ప్రస్తుత చంద్రబాబు సర్కార్‌ వాటిని ఇతర జిల్లాలకు తరలించేసింది. దీంతో గర్భిణులు స్కానింగ్‌ సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణ ఆరోగ్యకేంద్రాల్లోని లేబొరేటరీ పరికరాలను కూడా నిరుపయోగంగా మారుస్తున్నారు. ఇవి అక్కరకు రాకుండా పోతున్నాయి. ఇలా పట్టణ ఆరోగ్య సేవలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తుండటంతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అయినా పాలకులు పట్టించుకోవడం లేదనే విమర్శలు విని పిస్తున్నాయి.

వైద్యులు లేరనే సాకుతో..

2024లో ప్రభుత్వం మారిన తర్వాత పట్టణ ఆరోగ్యకేంద్రాల్లో కాంట్రాక్ట్‌ బేసెస్‌లో పనిచేసే గైనకాలజిస్టులు ఉద్యోగం మానేశారు. అనంతరం కొత్త వారిని నియమించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయలేదు. దీంతో ఏడాది పాటు ఆరోగ్యం కేంద్రాల్లో స్కానింగ్‌ మెషిన్లను నిరుపయోగంగా ఉంచారు. ఇటీవల వైద్యులు లేక యూపీహెచ్‌సీల్లోని స్కానింగ్‌ పరికరాలు పాడవుతున్నాయనే సాకుతో వాటిని ఇతర జిల్లాల్లోని గైనకాలజీ వైద్యులు ఉండే కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లకు తరలించేశారు. నగరంలో గతంలో 8 స్కానింగ్‌ మెషిన్‌లు ఏర్పాటు చేయగా, షేక్‌ రాజా ఆస్పత్రి మినహా, ఇతర ఏడు సెంటర్లలో స్కానింగ్‌ మెషిన్లను పశ్చిమగోదావరి తదితర జిల్లాలకు పంపేశారు.

ల్యాబ్‌ పరికరాలూ అంతే..

గత ప్రభుత్వ హయాంలో నగరంలోని 42 యూపీహెచ్‌సీల్లో అత్యాధునిక పరికరాలు అందజేశారు. ఒక్కో యూపీహెచ్‌సీకి రూ.50 లక్షలు వెచ్చించి దాదాపు రూ.20 కోట్లతో పరికరాలు సమకూర్చారు. ఇవి ప్రజలకు బాగా ఉపయోగపడేవి.

గత ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో ల్యాబ్‌ టెక్నీషియన్స్‌ కూడా ఉండటంతో 60 రకాల పరీక్షలను అక్కడే నిర్వహించేవారు. ఇప్పుడు కేవలం శాంపిల్‌ కలెక్షన్‌ పాయింట్స్‌గానే యూపీహెచ్‌సీలు మిగిలిపోయాయి. అక్కడ శాంపిల్‌ సేకరించి, సెంట్రల్‌ ల్యాబ్‌కు పంపిస్తుండటంతో, పరికరాలు నిరుపయోగంగా మారుతున్నాయి.

యూపీహెచ్‌సీల్లోని అల్ట్రాసౌండ్‌ మిషన్లు వాడక పోవడంతో పాడైపోతున్నాయి. వాటిని ఉన్నతాధికారుల ఆదేశాలతో వేరే ప్రాంతాల్లో గైనకాలజిస్టులు ఉన్న సీహెచ్‌సీల్లో ఏర్పాటు చేశారు. చిట్టినగర్‌లోని షేక్‌రాజా ఆస్పత్రిలో మాత్రం పని చేస్తుంది.

–మాచర్ల సుహాసిని, డీఎంహెచ్‌ఓ, ఎన్టీఆర్‌ జిల్లా

గత ప్రభుత్వ హయాంలో తమ నివాసాల సమీపంలో సేవలు పొందిన గర్భిణులు ఇప్పుడు పరీక్షల కోసం జీజీహెచ్‌కు వెళ్లాల్సి వస్తోంది. అక్కడ రద్దీ ఉండటంతో గంటల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. అంతేకాదు స్కానింగ్‌ పరీక్ష రాస్తే, అక్కడ సీరియల్‌ ఎక్కువగా ఉండటంతో రెండు, మూడు రోజుల తర్వాత రావాలని డేట్‌ ఇస్తున్నారు. దీంతో మళ్లీ వెళ్లాల్సి వస్తోంది. ఇలా రవాణా ఖర్చులతో పాటు, దూర ప్రయాణం చేయడానికి నిండు గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదే తమ సమీపంలోని యూపీహెచ్‌సీలో ఉంటే, ముందుగానే ఆశలు సమాచారం ఇచ్చి, గైనకాలజిస్టు వచ్చిన రోజు స్కానింగ్‌ చేయించే వాళ్లని చెబుతున్నారు.

ఆశయం ఆవిరి 1
1/1

ఆశయం ఆవిరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement