వేంకటేశ్వరస్వామికి స్వర్ణకిరీటాలు
గుడివాడ టౌన్: గుడివాడ జగన్నాథపురం పాటిమీద వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో స్వామి వారి ఉత్సవమూర్తులకు భక్తులు స్వర్ణకిరీటం సమర్పించినట్లు ఆలయ ఈఓ కె.వేణుగోపాలరావు తెలిపారు. సోమవారం ఉదయం ధనుర్మాస మహోత్సవ పూజా సమయంలో భక్తురాలు చలసాని అమృతవల్లి ఉత్సవమూర్తుల అలంకార నిమిత్తం 138 గ్రాముల మూడు స్వర్ణకిరీటాలు స్వామి వారికి సమర్పించారు. కార్యక్రమంలో పాలకమండలి చైర్మన్ ఎల్. శివరామ్ ప్రసాద్, అర్చకుడు వేదాంతం అప్పలాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.
తిరుమలగిరి వెంకన్నకు రూ. 28.41 లక్షల ఆదాయం
తిరుమలగిరి(జగ్గయ్యపేట): వాల్మీకోద్భవ వేంకటేశ్వరస్వామివారికి హుండీ కానుకలు, అన్నదానం, శివాలయం హుండీ ద్వారా రూ. 28.41 లక్షల ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో సాంబశివరావు పేర్కొన్నారు. ఆలయ ఆవరణలో సోమవారం కానుకలు లెక్కించారు. ఆయన మాట్లాడుతూ మూడు నెలల 18 రోజులకు హుండీ కానుకల ద్వారా రూ. 26.93 లక్షల ఆదాయం వచ్చిందన్నారు. కొండ కిందనున్న శివాలయం హుండీ కానుకల ద్వారా రూ. 29,843 రాగా అన్నదానం హుండీ ద్వారా రూ. 1.18 లక్షల ఆదాయం వచ్చిందని తెలిపారు. కమిటీ చైర్మన్ భరద్వాజ్, సిబ్బంది పాల్గొన్నారు.
ఇంటర్ యూనివర్సిటీ బాస్కెట్‌బాల్ పురుషుల జట్టు ఎంపిక
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): చైన్నెలోని ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆవరణలో ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు జరగనున్న సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ బాస్కెట్‌బాల్ పురుషుల టోర్నమెంట్‌లో తమ వర్సిటీ నుంచి ప్రాతినిధ్యం వహించే బాస్కెట్‌బాల్ జట్టులోని క్రీడాకారులను సోమవారం ఎంపిక చేశామని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్స్‌స్ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ డాక్టర్ ఇ.త్రిమూర్తి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్.తిరుమల వీర రాఘవరావు(ఆంధ్ర మెడికల్ కళాశాల, విశాఖపట్నం), బి.హేమవిజయకృష్ణసాయిప్రదీప్(ఆంధ మెడికల్ కళాశాల, విశాఖపట్నం), ఎం.శ్రీకర్ ప్రసాద్ (జీఎస్‌ఎల్ మెడికల్ కళాశాల, రాజమండ్రి), మహ్మద్ హుస్సేన్(జీస్‌ఎల్ మెడికల్ కళాశాల రాజమండ్రి), డి.వెంకట సాయి కమల్‌నాథ్(కాటూరి మెడికల్ కళాశాల, చిన్నకొండూరుపాడు), ఆర్.జాకబ్ రాజు(కాటూరి మెడికల్ కళాశాల, చిన్నకొండూరుపాడు),బి.రంజిత్ కుమార్ (ఎన్‌ఆర్‌ఐ మెడికల్ కళాశాల,చినకాకాని), ఏ.వెంకట మణి జయంత్ (ఎన్‌ఆర్‌ఐ మెడికల్ కళాశాల, చినకాకాని), డి.క్రాంతి రుద్ర(శ్రీకాకుళం ప్రభుత్వ మెడికల్ కళాశాల), సూరజ్ యాదవ్(శ్రీకాకుళం ప్రభుత్వ మెడికల్ కళాశాల), జీపీ రతన్(విష్ణు డెంటల్ కళాశాల, భీమవరం)తో పాటు జట్టు మేనేజర్‌గా నెల్లూరులోని నారాయణ మెడికల్ కళాశాలకు చెందిన ఫిజికల్ డైరెక్టర్ జె.ఎస్.బాబు, జట్టు కోచ్‌గా చినకాకానిలోని ఎన్‌ఆర్‌ఐ మెడికల్ కళాశాలకు చెందిన ఫిజికల్ డైరెక్టర్ టి.గురునాథంను ఎంపిక చేశామని తెలియజేశారు.
27న వైశ్య లైమ్‌లైట్
అవార్డ్స్ అందజేత
లబ్బీపేట(విజయవాడతూర్పు): వివిధ రంగాల్లో రాణిస్తున్న ఆర్యవైశ్య మహిళలకు ఈ నెల 27న మణిపల్లి లైమ్‌లైట్ అవార్డును ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు ఇమ్మడి శివకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను సోమవారం ఎంజీ రోడ్డులోని వారాహి సిల్క్స్ షోరూమ్‌లో ఆవిష్కరించారు. అనంతరం శివకుమార్ మాట్లాడుతూ మహిళల నాయకత్వం, ప్రతిభ, సామాజిక సేవలను వేడుకగా జరుపుకోవాలనే తమ నిబద్ధతను ఈ కార్యక్రమం మరింత బలపరుస్తుందన్నారు. సమాజంలో సానుకూల మార్పుకు దోహదపడిన ప్రేరణాత్మక మహిళా సాధికారులను గుర్తించి గౌరవించనున్నట్లు తెలిపారు.
వేంకటేశ్వరస్వామికి స్వర్ణకిరీటాలు
వేంకటేశ్వరస్వామికి స్వర్ణకిరీటాలు
వేంకటేశ్వరస్వామికి స్వర్ణకిరీటాలు


