యూజీ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల
కోనేరుసెంటర్: కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) మూడు, ఐదు సెమిస్టర్ పరీక్షల ఫలితాలను విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కూన రాంజీ సోమవారం విడుదల చేశారు. ఈ ఫలితాల్లో మూడో సెమిస్టర్‌కు సంబంధించి 51.85 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఐదో సెమిస్టర్‌లో 66.31 శాతం సాధించారు. వీసీ మాట్లాడుతూ సెమిస్టర్ పరీక్షక్ష ఫలితాల్లో విద్యార్థులు మంచి ఫలితాలు కనపర్చడం అభినందనీయమన్నారు. ఫలితాలు వెబ్‌సైట్‌లో అధికారికంగా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. పునఃమూల్యాంకనం కోరుకునే విద్యార్థులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు జనవరి 7 ఆఖరి తేదీగా తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఎన్.ఉష, పరీక్షల నియంత్రణ అధికారి పి.వీరబ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.


