అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం | Sakshi
Sakshi News home page

అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం

Published Thu, May 2 2024 11:54 AM

World Telugu Consortium online conference  ended successfully

అమెరిలో ఏప్రిల్ 27 వ తారీకు సాయంత్రం (భారత దేశ కాలమానము ఏప్రెల్ 28 ఉదయము) తొలి ప్రపంచ తెలుగు సమితి, "వరల్డ్ తెలుగు కన్సార్టియం" అంతర్జాల సమావేశం అద్భుతంగా జరిగింది.

ఎనిమిది దేశాలకు చెందిన 27మంది  వక్తలు, సంధానకర్తలతో సభ కళ కళ లాడింది. ఈ సభలో వంగూరి చిట్టెన్ రాజు, లలిత రామ్, వంశీ రామ రాజు, సింగపూర్ శ్రీ సాంస్కృతిక కళా సారధి అధ్యక్షులు రత్న కుమార్ కవుటూరు, రాధిక మంగిపూడి, షామీర్ జానకీ దేవి, శ్రీహవిష దాస్ , తెలుగు సాహిత్య ప్రపంచం లోని అతిరధ, మహారధులు పాల్గొన్నారు. మహాకవులు, రచయితలు, వాగ్గేయకారులు, వారి రచనల పై ఉత్తేజమైన ప్రసంగాలు ప్రత్యక్ష ప్రసారమయ్యాయి.

ఈ సమావేశాన్ని యూట్యూబ్ లో వీక్షించవచ్చు.

 

Advertisement
Advertisement