డల్లాస్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు | NATS Conduct Childrens Day Event At Dallas | Sakshi
Sakshi News home page

డల్లాస్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

Published Wed, Nov 27 2024 3:52 PM | Last Updated on Wed, Nov 27 2024 4:35 PM

NATS Conduct Childrens Day Event At Dallas

అమెరికాలో తెలుగుజాతి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా డల్లాస్‌లో బాలల సంబరాలు ఘనంగా నిర్వహించింది. భారత మాజీ ప్రధాని నెహ్రు జయంతి సందర్భంగా ప్రతి యేటా నాట్స్ డల్లాస్ విభాగం బాలల సంబరాలు నిర్వహిస్తోంది. గత పద్నాలుగు ఏళ్లుగా ఓ సంప్రదాయంలా నిర్వహిస్తున్నఈ సంబరాలను ఈ సారి ప్రిస్కో నగరంలో వండేమేట్టర్ మిడిల్ స్కూలులో ఘనంగా జరిపింది. 

బాలల సంబరాల్లో భాగంగా చదరంగం, గణితం, సంగీతం నృత్యం, తెలుగు పదజాలం, తెలుగు ఉపన్యాసం విభాగాల్లో జరిగిన పోటీల్లో దాదాపుగా 250 కి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో దరఖాస్తు చేసుకున్న పిల్లల్ని వివిధ వయసుల వారీగా విభజించి ఈ పోటీలు నిర్వహించారు. నాట్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ పోటీల్లో తెలుగు విద్యార్థులే  కాకుండా, ఇతర ప్రవాస భారతీయ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 

సాంప్రదాయ సంగీతం, నృత్యంతో పాటు సినిమా సంగీతం, నృత్యం విభాగాల్లో జరిగిన పోటీల్లో బాల బాలికలు తమ ప్రతిభను ప్రదర్శించారు. తెలుగు పదజాలం, తెలుగు ప్రసంగ పోటీల్లో అనర్ఘళంగా తెలుగు మాట్లాడి అతిథులను అబ్బురపరిచారు. ఈ పోటీల్లో పాల్గొన్న వారిలో దాదాపు 90 మందికి పైగా పిల్లలు పలు విభాగాల్లో విజేతలుగా నిలిచారు. 

డల్లాస్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటి నేతృత్వంలో ఈ బాలల సంబరాలను దిగ్విజయం చేయడంలో కీలక పాత్ర పోషించారు.  దాదాపు మూడు నెలల ముందు నుండే పక్కా ప్రణాళికతో బాలల సంబరాలను నాట్స్ డల్లాస్ బృందం విజయవంతం చేసింది.

నాట్స్ బాలల సంబరాలకు  నాట్స్ మాజీ అధ్యక్షులు బాపు నూతి,  నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల, ఉప కోశాధికారి రవి తాండ్ర, సౌత్ సెంట్రల్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ సత్య శ్రీరామనేని, మీడియా రిలేషన్స్ నేషనల్ కోఆర్డినేటర్ కిషోర్ నారెలు ఇచ్చిన అమూల్యమైన సూచనలు, మార్గదర్శకత్వం బాలల సంబరాల విజయానికి దోహదపడ్డాయని స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటి తెలిపారు.

డల్లాస్ చాప్టర్ సలహా బోర్డు సభ్యులు సురేంద్ర ధూళిపాళ్ల, కవిత దొడ్డ, డీ వీ ప్రసాద్, రవీంద్ర చుండూరు, డాలస్ చాప్టర్ జట్టు సభ్యులు సౌజన్య రావెళ్ల , కావ్య కాసిరెడ్డి, పావని నున్న, శ్రీనివాస్ ఉరవకొండ, కిరణ్ నారె, ఉదయ్, నాగార్జున, బద్రి బియ్యపు, మోహన్ గోకరకొండ, యూత్ టీం నుండి నిఖిత, సహస్ర, ప్రణవి, వేద శ్రీచరణ్, అద్వైత్, ధృవ్, పావని, అమితేష్, ఈశ్వర్, చంద్రాంక్ తదితరులు నాట్స్ బాలల సంబరాల్లో  పాల్గొని విద్యార్ధులను ప్రోత్సహించారు.

బాలల సంబరాలను జయప్రదం చేసిన జట్టు సభ్యులకు, పిల్లలకు, తల్లిదండ్రులకు, న్యాయనిర్ణేతలకు, దాతలకు, యువ సభ్యులకు నాట్స్ మాజీ అధ్యక్షులు బాపు నూతి ధన్యవాదాలు తెలిపారు. ఈ బాలల సంబరాలను పద్నాలుగు సంవత్సరాలక్రితం డల్లాస్ నగరంలో ఏర్పాటుచేసి, ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా నిర్వహిస్తూ, మరిన్ని నాట్స్ చాఫ్టర్లు ఉన్న నగరాలకు విస్తరించామని తెలిపారు. 

మన ప్రవాస భారతీయ పిల్లలకు, ప్రత్యేకంగా తెలుగు వారి పిల్లలకు, వారి ప్రతిభను, నాయకత్వ లక్షణాలను, పోటీతత్వాన్ని పెంపొందించే అవకాశాలను కల్పించటం చాలా సంతోషంగా ఉందని  బాపు నూతి అన్నారు. ఈ బాలల సంబరాలలో ప్రతి సంవత్సరం పాల్గొనే పిల్లల సంఖ్య పెరుగుతుండటంపై బాపు హర్షం వ్యక్తం చేశారు. స్వాగత్ బిర్యానీస్, వేల్యూ ఫైనాన్సియల్ సర్వీసెస్, ఆర్కా చిల్డ్రన్స్ అకాడమీ, హింద్ సైట్, కోపెల్ చెస్ క్లబ్, వోల్డీలక్స్ మరియు ఫార్మ్2కుక్ లకు నాట్స్ డల్లాస్ చాప్టర్ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. గత 14 సంవత్సరాలుగా బాలల సంబరాలను దిగ్వజయంగా నిర్వహిస్తున్న డల్లాస్ టీంకి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు అధ్యక్షులు మదన్ పాములపాటిలు ప్రత్యేక అభినందనలు  తెలిపారు.

(చదవండి: గ్రేటర్ ఓర్లాండోలో నాట్స్ ప్రస్థానం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement