అమెరికాలో ఘనంగా కేటీఆర్‌ జన్మదిన వేడుకలు | Sakshi
Sakshi News home page

అమెరికాలో ఘనంగా కేటీఆర్‌ జన్మదిన వేడుకలు

Published Mon, Jul 25 2022 9:25 PM

Ktr Birthday Celebration In America Dallas - Sakshi

టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు వేడుక‌లు అమెరికాలో ఘనంగా జరిగాయి. డల్లాస్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ నేత అభిషేక్‌ కొత్తుర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో ఎన్నారైలు పెద్ద ఎత‍్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నారైలు కేక్‌ కటింగ్‌  చేసి కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం అభిషేక్‌ కొత్తూర్‌ కేటీఆర్‌ రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్య‌మ‌కారుడిగా రాజ‌కీయ ప్ర‌స్థానం ప్రారంభించిన కేటీఆర్ 2009లో తొలిసారి సిరిసిల్ల ఎమ్మెల్యేగా విజయం సాధించారని, ఆ విజయాల పరపరం కొనసాగిస్తూ రాష్ట్ర మంత్రిగా రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్నారని కొనియాడారు. మంత్రి కేటీఆర్‌కు అభిషేక్‌ జ‌న్మ దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement